రెడ్ బాల్‌తో పాండ్యా ప్రాక్టీస్.. అసలు విషయాన్ని బయటపెట్టిన పార్థివ్ పటేల్

by Harish |
రెడ్ బాల్‌తో పాండ్యా ప్రాక్టీస్.. అసలు విషయాన్ని బయటపెట్టిన పార్థివ్ పటేల్
X

దిశ, స్పోర్ట్స్ : టీమ్ ఇండియా స్టార్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా తిరిగి టెస్టుల్లోకి పునరాగమనం చేసేందుకు సిద్ధమవుతున్నాడని వార్తలు వచ్చాయి. ట్రైనింగ్‌ సెషన్‌లో రెడ్ బాల్‌తో బౌలింగ్ చేస్తున్న వీడియోను పాండ్యా సోషల్ మీడియాలో పోస్టు చేయడంతో ఆ వార్తలు మొదలయ్యాయి. అయితే, పాండ్యా ట్రైనింగ్ సెషన్‌ గురించి భారత మాజీ క్రికెటర్ పార్థివ్ పటేల్ ఆసక్తికర విషయం వెల్లడించాడు. తాజాగా జియో సినిమాతో మాట్లాడుతూ.. వైట్ బాల్ అందుబాటులో లేకపోవడంతోనే అతను రెడ్ బాల్ బౌలింగ్ చేశాడని తెలిపాడు.

‘పాండ్యాను నేను టెస్టుల్లో చూడాలనుకోవడం లేదు. వైట్‌బాల్ అందుబాటులో లేకపోవడంతోనే అతను రెడ్‌బాల్ ప్రాక్టీస్ చేసి ఉండొచ్చు. పాండ్యా శరీరం సుదీర్ఘ మ్యాచ్‌లకు అనుకూలంగా ఉండదు. ఒకవేళ టెస్టుల్లోకి పరిగణలోకి తీసుకుంటే అంతకుముందు అతన్ని కనీసం ఒక ఫస్ట్ క్లాస్ మ్యాచైనా ఆడించాలి. అది అసంభవం.’ అని పార్థివ్ పటేల్ కీలక వ్యాఖ్యలు చేశాడు. కాగా, గాయాల కారణంగా పాండ్యా టెస్టు జట్టుకు దూరమయ్యాడు. 2018 నుంచి అతను టెస్టులు ఆడటం లేదు. 2019లో వెన్నుముక సర్జరీ తర్వాత రెడ్‌బాల్‌కు పూర్తిగా దూరమయ్యాడు. భారత్ తరపున 11 టెస్టులు ఆడిన పాండ్యా 532 పరుగులతోపాటు 17 వికెట్లు పడగొట్టాడు.

Advertisement

Next Story