Paris Olympics : పారిస్ ఒలింపిక్స్‌లో ఆ దేశానికే అత్యధిక పతకాలు.. మెడల్ టేబుల్‌లో భారత్ స్థానం ఎంతో తెలుసా?

by Harish |
Paris Olympics : పారిస్ ఒలింపిక్స్‌లో ఆ దేశానికే అత్యధిక పతకాలు.. మెడల్ టేబుల్‌లో భారత్ స్థానం ఎంతో తెలుసా?
X

దిశ, స్పోర్ట్స్ : పారిస్ ఒలింపిక్స్ ముగిశాయి. అగ్రరాజ్యం అమెరికా మరోసారి పతకాల్లో జోరు ప్రదర్శించింది. మొత్తం 126 పతకాలతో అగ్రస్థానంలో నిలిచింది. అందులో 40 స్వర్ణాలు, 44 రజతాలు, 42 కాంస్య పతకాలు ఉన్నాయి. చైనా 91 పతకాలతో(40 స్వర్ణాలు, 27 రజతాలు, 24 కాంస్యాలు) రెండో స్థానంతో సరిపెట్టింది. మొదటి నుంచి ఈ రెండు దేశాలు పతకాల కోసం నువ్వానేనా అన్నట్టు పోటీపడ్డాయి.

స్వర్ణ పతకాల ఆధారంగా నిర్వాహకులు ర్యాంక్‌లను ఇస్తారు. అయితే, స్వర్ణ పతకాల విషయంలో అమెరికా, చైనా 40 గోల్డ్ మెడల్స్‌తో సమవుజ్జీలుగా నిలిచాయి. ఆదివారం ఆరంభంలో 39 స్వర్ణాలతో అమెరికా వెనుకబడగా.. మహిళల బాస్కెట్‌బాల్ జట్టు అందించిన గోల్డ్ మెడల్‌తో యూఎస్‌ఏ 40వ స్వర్ణం ఖాతాలో వేసుకోవడంతోపాటు అత్యధిక పతకాలతో టాప్ పొజిషన్‌ను దక్కించుకుంది. జపాన్(45), ఆస్ట్రేలియా(53), ఫ్రాన్స్(64) దేశాలు టాప్-5లో నిలిచాయి. భారత్ ఆరు పతకాలతో 71వ స్థానంతో సరిపెట్టింది. స్వర్ణం మాత్రమే గెలిచిన పాకిస్తాన్ 62వ స్థానంలో నిలిచి.. భారత్ కంటే 9 స్థానాలు ముందండటం గమనార్హం.

Advertisement

Next Story