- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Paris Olympics : తెలుగు కుర్రాడు ధీరజ్ అదరహో.. క్వార్టర్స్‌కు పురుషుల ఆర్చరీ జట్టు
దిశ, స్పోర్ట్స్ : పారిస్ ఒలింపిక్స్‌ను భారత ఆర్చర్లు ఘనంగా మొదలుపెట్టారు. భారత మహిళల జట్టు ఇప్పటికే క్వార్టర్స్‌కు చేరుకోగా.. పురుషుల జట్టు కూడా నేరుగా క్వార్టర్ ఫైనల్స్‌కు అర్హత సాధించింది. తెలుగు కుర్రాడు ధీరజ్ తొలి రోజు తన విలు విద్య నైపుణ్యాలతో అదరగొట్టాడు. పురుషుల జట్టు క్వార్టర్ ఫైనల్స్‌కు చేరుకోవడంలో కీలక పాత్ర పోషించాడు. ధీరజ్, తరుణ్‌దీప్ రాయ్, ప్రవీణ్ జాదవ్‌లతో కూడిన భారత జట్టు 2013 పాయింట్లతో మూడో స్థానంలో నిలిచింది. వ్యక్తిగత ఈవెంట్‌లో ధీరజ్ 720 పాయింట్లకుగానూ 681 పాయింట్లు సాధించి 4వ స్థానంలో నిలిచాడు. తరుణ్‌దీప్ రాయ్(674), ప్రవీణ్ జాదవ్(658) 14వ, 39వ స్థానాల్లో నిలిచారు. క్వార్టర్స్‌లో భారత జట్టు తుర్కియే లేదా కొలంబియాతో తలపడనుంది. మిక్స్‌డ్ టీమ్ ఈవెంట్‌లో భారత్ (1347 పాయింట్లు) ఐదో స్థానంలో నిలిచి ప్రీక్వార్టర్స్‌లోకి ప్రవేశించింది. ర్యాంకింగ్ రౌండ్‌లో భారత్ తరపున టాప్‌లో నిలిచిన ధీరజ్, అంకిత భకత్ మిక్స్‌డ్ టీమ్ ఈవెంట్‌లో పాల్గొంటారు. ప్రీక్వార్టర్స్‌లో ధీరజ్, అంకిత జోడీ ఇండోనేషియా ఆర్చర్లను ఎదుర్కొనుంది.
- Tags
- #Paris Olympics