Paris Olympics : పారిస్ ఒలింపిక్స్‌లో బిల్‌గేట్స్ అల్లుడు.. అల్లుడికి గుడ్ లక్ చెప్పిన అత్త

by Harish |
Paris Olympics : పారిస్ ఒలింపిక్స్‌లో బిల్‌గేట్స్ అల్లుడు.. అల్లుడికి గుడ్ లక్ చెప్పిన అత్త
X

దిశ, స్పోర్ట్స్ : పారిస్ ఒలింపిక్స్‌లో మైక్రోసాఫ్ట్ సహ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్ అల్లుడు అదృష్ట్యాన్ని పరీక్షించుకోనున్నాడు. బిల్ గేట్స్ పెద్ద కూతురు జెన్నిఫర్ భర్త నాయెల్ నాజర్ ప్రొఫెషనల్ ఈక్వెస్ట్రియన్. ఈజిఫ్ట్ తరపున నాజర్ విశ్వక్రీడల్లో బరిలోకి దిగబోతున్నాడు. జంపింగ్ వ్యక్తిగత ఈవెంట్‌లో అతను పోటీపడుతున్నాడు. ఈ ఈవెంట్ ఆగస్టు 5న జరగనుంది. బిల్ గేట్స్ భార్య మెలిండా ఫ్రెంచ్ గేట్స్ అల్లుడికి సోషల్ మీడియా వేదికగా గుడ్ లక్ చెప్పింది. ‘ఒలింపిక్స్‌లో మీరు పోటీపడటాన్ని చూడటం సంతోషంగా ఉంది. మీకు మద్దతు తెలియజేస్తున్నా.’ అని ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టు పెట్టింది.

కాగా, నాజర్‌కు ఇవి మూడో ఒలింపిక్స్. గతంలో లండన్, టోక్యో విశ్వక్రీడల్లో పాల్గొన్నాడు. టోక్యో క్రీడల్లో ఫైనల్‌కు చేరాడు. ఈ సారి పతకంపై అతను దృష్టి పెట్టాడు. మరోవైపు, జెన్నిఫర్‌కు గుర్రపు స్వారీ అంటే మక్కువ. ఓ ఈక్వెస్ట్రియన్ పోటీలోనే నాజర్‌ను కలిసింది. ఆ పరిచయం ప్రేమగా మారింది. 2017 నుంచి డేటింగ్‌లో ఉన్న ఈ జంట 2021లో వివాహబంధంలోకి అడుగుపెట్టింది. ఆ దంపతులకు గతేడాది తొలి సంతానంగా కూతురు పుట్టింది.

Advertisement

Next Story

Most Viewed