Paralympics 2024 : భారత్‌కు ఐదో పతకం.. కాంస్యం సాధించిన షూటర్ రుబీనా

by Harish |
Paralympics 2024 : భారత్‌కు ఐదో పతకం.. కాంస్యం సాధించిన షూటర్ రుబీనా
X

దిశ, స్పోర్ట్స్ : పారిస్ పారాలింపిక్స్‌లో భారత పారా షూటర్లు అదరగొడుతున్నారు. శనివారం కూడా షూటర్ల పతక వేట కొనసాగింది. మహిళా షూటర్ రుబీనా ఫ్రాన్సిస్ కాంస్యం సాధించింది. మహిళల 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ ఎస్‌హెచ్1 కేటగిరీలో ఆమె మెడల్ దక్కించుకుంది. క్వాలిఫికేషన్ రౌండ్‌లో రుబీనా 556 స్కోరుతో 6వ స్థానంలో నిలిచి ఫైనల్‌కు చేరుకుంది. ఫైనల్‌లోనూ ఆమె సత్తాచాటింది. 211.1 స్కోరుతో మూడో స్థానంలో నిలిచి బ్రాంజ్ మెడల్ కైవసం చేసుకుంది.

20 రౌండ్లు ముగిసే సమయానికి ఆమె 193.0 స్కోరుతో రెండో స్థానంలో నిలిచి రజతం సాధించేలా కనిపించింది. అయితే, 21, 22 షూట్లలో వెనుకబడటంతో రుబీనా కాంస్యంతో సరిపెట్టింది. ఇరాన్ షూటర్ సరెహ్ జవాన్‌మర్డి(236.8) స్వర్ణం దక్కించుకోగా..తుర్కియేకు చెందిన ఐసెల్ ఓజ్గాన్(231.1) రజతం గెలుచుకుంది. రుబీనా మెడల్‌తో షూటింగ్‌లో నాలుగో పతకం దక్కగా.. మొత్తంగా భారత్ పతకాల సంఖ్య ఐదుకు చేరింది.

Advertisement

Next Story

Most Viewed