INDvsPAK : ఆసియా కప్‌లో భారత్–పాక్ మ్యాచ్.. మాటల యుద్ధం మొదలు!

by Vinod kumar |
INDvsPAK : ఆసియా కప్‌లో భారత్–పాక్ మ్యాచ్.. మాటల యుద్ధం మొదలు!
X

దిశ, వెబ్‌డెస్క్: భారత్, పాకిస్తాన్ ద్వైపాక్షిక సిరీస్ జరిగిన పదేళ్లు దాటిపోయింది. అందుకే ఈ మ్యాచులకు హైప్ కూడా తెగ పెరుగుతోంది. ఈ క్రమంలోనే ఆసియా కప్‌లో కూడా ఈ రెండు టీమ్స్ ఢీకొట్టేందుకు రెడీ అవుతున్నాయి. సెప్టెంబర్ 2న జరగనున్న మ్యాచ్‌ కోసం కోట్లాది మంది అభిమానులు ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో అప్పుడే రెండు జట్ల మధ్య మాటల యుద్ధం మొదలైంది. రెండు జట్లూ ఒకే గ్రూపులో ఉండటంతో కచ్చితంగా రెండుసార్లు తలపడటం ఖాయంగా కనిపిస్తోంది. అదే ఫైనల్ చేరితే రెండు టీమ్స్ మరోసారి టైటిల్ కోసం పోటీ పడతాయి. ఈ మ్యాచుల కోసం ఫ్యాన్స్ తెగ ఎదురు చూస్తున్నారు. ఇలాంటి సమయంలో చాలా మంది మాజీలు భారత్, పాక్ వైరంపై రకరకాల కామెంట్స్ చేశారు. కొందరేమో ఇది పెద్ద వైరమే కాదని అంటే.. మరికొందరు మాత్రం ఈ వైరానికి చాలా ఇంపార్టెన్స్ ఇచ్చి మాట్లాడారు. తాజాగా పాక్ సారధి బాబర్ ఆజమ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.

సెప్టెంబర్ 2న పల్లెకెలె వేదికగా భారత్, పాకిస్తాన్ తలపడేందుకు రెడీ అవుతున్న సంగతి తెలిసిందే. ఈ రెండు జట్ల మధ్య వైరం చాలా గొప్పదని, ఫ్యాన్స్‌తోపాటు ఆటగాళ్లు కూడా దీన్ని బాగా ఎంజాయ్ చేస్తారని చెప్పాడు. అలాగే ప్లేయర్లు తమ వంద శాతం ఇచ్చి, గెలిచిన తర్వాత గొప్పలు చెప్పుకునేందుకు ట్రై చేస్తారని అన్నాడు. ఈ రెండు టీమ్స్ ఎప్పుడు తలపడినా అది వైరమే అని ఒప్పుకున్నాడు. 'ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ ఎప్పుడూ గొప్ప వైరమే. ప్రపంచం మొత్తం ఈ మ్యాచ్‌ను ఎంజాయ్ చేస్తుంది. మేం కూడా తెగ ఎంజాయ్ చేస్తాం. ఈ మ్యాచుల్లో క్రికెట్ స్థాయి అత్యుత్తమంగా ఉంటుంది. గట్టి పోటీ కనిపిస్తుంది. ఫ్యాన్స్ అందరూ భారత్, పాక్ మ్యాచులను మిస్ అవుతారు. రెండు టీమ్స్ నూటికి నూరు శాతం ఎఫర్ట్ పెడతాయి' అని బాబర్ చెప్పుకొచ్చాడు.

Advertisement

Next Story

Most Viewed