సఫారీలపై పాకిస్తాన్ రికార్డు విజయం

by John Kora |
సఫారీలపై పాకిస్తాన్ రికార్డు విజయం
X

దిశ, స్పోర్ట్స్: ట్రై నేషన్ సిరీస్‌లో భాగంగా దక్షిణాఫ్రికాతో జరిగిన వన్డే మ్యాచ్‌లో పాకిస్తాన్ జట్టు ఘన విజయం సాధించింది. కరాచీలోని నేషనల్ స్టేడియం వేదికగా జరిగిన వన్డేలో తొలుత బ్యాటింగ్ చేసిన సౌతాఫ్రికా జట్టు నిర్ణీత 50 ఓవర్లలో కేవలం నాలుగు వికెట్లు కోల్పోయి 352 పరుగుల భారీ స్కోర్ సాధించింది. దక్షిణాఫ్రికా కెప్టెన్ బవూమా 82, బ్రీత్జీ 83, క్లాసెన్ 87, వెరీనే 44 పరుగులతో రాణించారు. ఓపెనర్ టోనీ డి జోర్జీ త్వరగానే ఔటైనా.. ఆ తర్వాత టాప్, మిడిల్ ఆర్డర్ పాకిస్తాన్ బౌలర్లపై విరుచుకపడ్డారు. దూకుడుగా ఆడటంతో సఫారీలు 352 పరుగులు సాధించారు. 353 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన పాకిస్తాన్ జట్టు టాపార్డర్ విఫలమయ్యింది. ఫకర్ జమాన్ 44 పరుగులతో పర్వాలేదనిపించినా.. బాబర్ ఆజమ్ 23, సౌద్ షకీల్ 15 తక్కువ పరుగులకే అవుటయ్యారు. ఆ తర్వాత వచ్చిన మహ్మద్ రిజ్వాన్ (122), సల్మాన్ అఘా (134) సెంచరీలతో కదం తొక్కారు. వీరిద్దరూ దక్షిణాఫ్రికా బౌలర్లను ఊచకోత కోశారు. నాలుగో వికెట్‌కు ఏకంగా 260 పరుగుల భాగస్వామ్యం అందించారు. చివర్లో సల్మాన్ అవుటైనా.. పాకిస్తాన్ జట్టు మరో ఓవర్ మిగిలి ఉండగానే విజయలక్ష్యాన్ని చేరుకుంది.

Next Story

Most Viewed