కోహ్లీ, రోహిత్ రిటైర్మెంట్‌‌పై షాకింగ్ విషయాలు చెప్పిన భారత బౌలింగ్ కోచ్

by Harish |
కోహ్లీ, రోహిత్ రిటైర్మెంట్‌‌పై షాకింగ్ విషయాలు చెప్పిన భారత బౌలింగ్ కోచ్
X

దిశ, స్పోర్ట్స్ : టీమ్ ఇండియా కెప్టెన్ రోహిత్, కోహ్లీ టీ20లకు రిటైర్మెంట్ ప్రకటించిన విషయం తెలిసిందే. టీ20 వరల్డ్ కప్ విజయం తర్వాత వారిద్దరూ పొట్టి ఫార్మాట్‌కు గుడ్ బై చెప్పి అందరినీ షాక్‌కు గురి చేశారు. అయితే, రోహిత్, కోహ్లీ టీ20లకు వీడ్కో్లు పలికే వరకు జట్టు సభ్యులకు, సపోర్టింగ్ స్టాఫ్‌‌కు ఆ విషయం తెలియదట. ఈ విషయాన్ని మాజీ హెడ్ కోచ్ ద్రవిడ్ సపోర్టింగ్ స్టాఫ్‌లో బౌలింగ్ కోచ్‌గా ఉన్న పరాజ్ మాంబ్రే వెల్లడించాడు. తాజాగా జాతీయ మీడియాతో పరాజ్ మాంబ్రే మాట్లాడుతూ.. రోహిత్, కోహ్లీ టీ20లకు రిటైర్మెంట్ ప్రకటించడం తమనూ ఆశ్చర్యానికి గురి చేసిందన్నాడు.

‘నాకు తెలిసినంత వరకు ఎవరూ ఊహించలేదు. వారు ఎవరితోనూ చర్చించలేదు. ద్రవిడ్‌తో చెప్పి ఉంటే చెప్పొచ్చు. కానీ, జట్టు సభ్యులతోగానీ, ఇతరులతోగానీ చెప్పలేదు. అందుకే ఆశ్చర్యపోయాం.’ అని చెప్పాడు. అలాగే, దశాబ్దానికిపైగా ఆడిన ప్లేయర్లు రిటైర్మెంట్ ప్రకటించడానికి అది సరైన సమయమేనని తెలిపాడు. ‘వయసు మన చేతుల్లో ఉండదు. కాబట్టి, కొన్నిసార్లు నిర్ణయం తీసుకోవాల్సిందే. ఏ ఫార్మాట్ ఆడాలనే దానిపై నిర్ణయం తీసుకోవాలి. ఆ ఫార్మాట్‌పై ఫోకస్ పెట్టడానికి క్రికెట్‌ను తగ్గించుకోవాలి. ప్రపంచకప్ గెలవడం కంటే పెద్దది ఇంకేముండదని భావించి వారు ఆ నిర్ణయం తీసుకుని ఉంటారనుకుంటున్నా.’ అని చెప్పుకొచ్చాడు.

Advertisement

Next Story

Most Viewed