- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- వైరల్
చాంపియన్స్ ట్రోఫీ ఓపెనింగ్ సెర్మనీ రద్దు?.. కారణం అదేనా?

దిశ, స్పోర్ట్స్ : వచ్చే నెలలో జరగబోయే చాంపియన్స్ ట్రోఫీ టోర్నీ ఓపెనింగ్ సెర్మనీని రద్దు చేసినట్టు వార్తలు వస్తున్నాయి. టోర్నమెంట్‌లో పాల్గొనే జట్ల బిజీ షెడ్యూల్ కారణంగా ప్రారంభ వేడుకలు నిర్వహించే పరిస్థితి లేదని సమాచారం. ఈ విషయాన్ని పాకిస్తాన్ క్రికెట్ బోర్డు(పీసీబీ) అధికారికంగా ప్రకటించినప్పటికీ.. పీసీబీ వర్గాలు మాత్రం ఈ విషయాన్ని స్పష్టం చేశాయి. ఓపెనింగ్ సెర్మనీతోపాటు కెప్టెన్ల ఫొటోషూట్‌ను కూడా రద్దు చేసినట్టు సదరు వర్గాలు పీటీఐతో చెప్పాయి. ‘టోర్నీకి ముందు అన్ని జట్లు బిజీ షెడ్యూల్ కలిగి ఉన్నాయి. భారత్, ఇంగ్లాండ్ వన్డే సిరీస్ ఆడబోతున్నాయి. ఆస్ట్రేలియా, శ్రీలంక మధ్య వన్డే, టెస్టు సిరీస్‌లు జరగనున్నాయి.’ అని పీసీబీ వర్గాలు తెలిపాయి. దీంతో ఫొటోషూట్ రద్దవడంతో భారత కెప్టెన్ రోహిత్ శర్మ పాకిస్తాన్‌కు వెళ్తాడా?లేదా? అన్న ప్రశ్నకు తెరపడింది. అయితే, అధికారికంగా ఓపెనింగ్ సెర్మనీకి బదులు పీసీబీ ఫిబ్రవరి 16న లాహోర్‌లో ప్రారంభ వేడుకలను నిర్వహించనున్నట్టు తెలిసింది. కాగా, వచ్చే నెల 19 నుంచి చాంపియన్స్ ట్రోఫీ ప్రారంభంకానుంది.