- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
Prayagraj: మహా కుంభమేళాను దర్శించుకున్న 62 కోట్ల మంది భక్తులు

దిశ, నేషనల్ బ్యూరో: ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో జరుగుతున్న మహా కుంభమేళా వేడుకను 62 కోట్ల మంది భక్తులు దర్శించుకున్నారని యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ తెలిపారు. ఆదివారం ఆగ్రాలో జరిగిన ఓ కార్యక్రమంలో మాట్లాడిన ఆయన.. ఒక వేడుకకు ఇంతమంది ప్రజలు ఒకచోట చేరడం అరుదైన సంఘటన. ఈ శతాబ్దంలోనే అరుదైనది. ఈ కుంభమేళాను స్టార్టప్ ప్రపంచంలో యూనికార్న్ తరహా లాంటిది. ఇప్పటివరకు ప్రయాగ్‌రాజ్ కుంభమేళాకు 62 కోట్ల మంది భక్తులు వచ్చారు. ఈ స్థాయి ఆదరణతో దేశంలోని నాలుగు ముఖ్యమైన ప్రదేశాల్లో ఇలాంటి వేడుకను నిర్వహించేందుకు ప్రోత్సాహకరంగా ఉంటుందని యోగి ఆదిత్యనాథ్ చెప్పారు. ఈ సందర్భంగా రానున్న మహా శివరాత్రి రోజున భారీ సంఖ్యలో భక్తులు వచ్చే అవకాశం ఉన్నందున మహా కుంభమేళాను సజావుగా నిర్వహించేందుకు, భద్రతను కట్టుదిట్టం చేసే చర్యలు తీసుకున్నట్టు అధికారులు తెలిపారు. ముఖ్యంగా అయోధ్య ధామ్ రైల్వే స్టేషన్‌లో అధిక రద్దీని నియంత్రించేందుకు అదనపు భద్రతను మోహరించినట్టు డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ యశ్వంత్ సింగ్ చెప్పారు. రైళ్ల రాకపోకలపై స్పష్టమైన ప్రకటనలు జారీ చేశారు. ప్లాట్‌ఫామ్‌లలో ప్రయాణికులు సామర్థ్యానికి మించి ఉండటానికి వీల్లేకుండా చూసుకుంటున్నామని పేర్కొన్నారు.