- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
భాష హుందాగా ఉండాలి.. వాళ్లలా వద్దు: ఎమ్మెల్యేలకు పవన్ కీలక సూచనలు

దిశ, వెబ్ డెస్క్: భాష హుందాగా ఉండాలని, వైసీపీ(Ycp)లా వద్దు అని జనసేన(Janasena)ఎమ్మెల్యేలకు ఆ పార్టీ అధినేత పవన్ కల్యాణ్(Pawan Kalyan)సూచించారు. అసెంబ్లీ సమావేశాలకు సమయం ఆసన్నమవుతున్న నేపథ్యంలో జనసేన శాసనసభ పక్ష నేతలకు ఆయన దిశానిర్దేశం చేశారు. ప్రజా గొంతును అసెంబ్లీలో వినిపించాలని సూచించారు. ప్రజా సమస్యలు, ఆకాంక్షలు చట్టసభల్లో చర్చిద్దామని తెలిపారు. చర్చల్లో జనసేన సభ్యులు పాల్గొనాలని సూచించారు. అలాగే ఎమ్మెల్యేలు మాట్లాడే భాష హుందాగా ఉండాలని పవన్ కల్యాణ్ చెప్పారు.
కాగా అసెంబ్లీ సమావేశాలకు సర్వం సిద్ధమైంది. శాసన సభ, శాసనమండలి సమావేశాలు సోమవారం నుంచి నిర్వహించాలని నిర్ణయించిన విషయం తెలిసిందే. అయితే సభ్యులందరూ హాజరు కావాలని స్పీకర్ అయ్యన్న పాత్రుడు ఇప్పుడే ఆదేశాలు జారీ చేశారు. మరోవైపు మాజీ సీఎం, పులివెందుల ఎమ్మెల్యే, వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి సభలకు హాజరుకావాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఆయనతో పాటు వైసీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలందరూ హారుకానున్నారని తెలిపారు. అసెంబ్లీలో ప్రతిపక్ష హోదా డిమాండ్ చేయాలని నిర్ణయించారు.
అయితే ప్రభుత్వం కూడా అస్త్రశస్త్రాలు రెడీ చేస్తోంది. సోమవారం ఉదయం 9.30లకే సీఎం చంద్రబాబు నాయుడు అసెంబ్లీకి చేరుకోనున్నారు. ఉదయం10 గంటలకు గవర్నర్ ప్రసంగంతో బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. సభ వాయిదా తర్వాత బీఏసీ మీటింగ్ నిర్వహించనున్నారు. ఎన్ని రోజులు ఉభయసభలు నడపాలనే అంశాలపై చర్చించనున్నారు. మూడు వారాల పాటు సభలు నడపాలని యోచిస్తున్నారు. బీఏసీ మీటింగ్‌లో స్పష్టత వచ్చే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో అటు అసెంబ్లీ వద్ద కూడా పటిష్ట భద్రత ఏర్పాటు చేయనున్నారు. ఇప్పటికే డీజీపీతో ప్రభుత్వం చర్చించింది.