- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
IND VS ENG : టీమ్ ఇండియాకు భారీ షాక్.. సిరీస్ మొత్తానికి తెలుగు కుర్రాడు దూరం

దిశ, స్పోర్ట్స్ : ఇంగ్లాండ్‌తో టీ20 సిరీస్‌లో భారత్‌కు భారీ షాక్ తగిలింది. భారత యువ సంచలనం, తెలుగు కుర్రాడు నితీశ్ కుమార్ రెడ్డి గాయం కారణంగా మిగతా సిరీస్ నుంచి వైదొలిగాడు. శుక్రవారం ప్రాక్టీస్ సెషన్‌లో అతను పక్కటెముకుల గాయం బారిన పడ్డాడు. గాయం తీవ్రత ఎక్కువగా ఉండటంతో అతను సిరీస్ నుంచి తప్పుకోవాల్సి వచ్చింది. పునరావాసం కోసం అతను బెంగళూరులోని బీసీసీఐ సెంట్రల్ ఆఫ్ ఎక్స్‌లెన్స్‌కు వెళ్లనున్నాడు. తొలి టీ20లో తుది జట్టులో ్థానం దక్కినప్పటికీ నితీశ్ బ్యాటింగ్, బౌలింగ్ చేసే అవకాశం రాలేదు. మరోవైపు, యువ బ్యాటర్ రింకు సింగ్ కూడా గాయపడ్డాడు. తొలి టీ20లో అతను వెన్నునొప్పితో ఇబ్బందిపడ్డాడు. దీంతో అతను రెండో టీ20తోపాటు మూడో టీ20కి దూరమయ్యాడు. నాలుగో మ్యాచ్‌క అందుబాటులో ఉంటాడా?లేదా? అన్నది ఇప్పుడే చెప్పలేం. నితీశ్, రింకుల పరిస్థితిని బీసీసీఐ మెడికల్ టీమ్ పర్యవేక్షిస్తున్నది. ఈ క్రమంలోనే భారత సెలెక్టర్లు వీరి స్థానాల్లో శివమ్ దూబె, రమణ్‌దీప్‌లను భర్తీ చేశారు. చివరిసారిగా గతేడాది ఆగస్టులో భారత్‌కు ప్రాతినిధ్యం వహించిన దూబె.. దాదాపు ఆరు నెలల తర్వాత జట్టులోకి తిరిగి వచ్చాడు. గాయం కారణంగా సొంతగడ్డపై బంగ్లాతో సిరీస్‌కు దూరమయ్యాడు. మరోవైపు, రమణ్‌దీప్ గతేడాది సౌతాఫ్రికా టూరులో అంతర్జాతీయ అరంగేట్రం చేశాడు.