లాస్ట్ బాల్‌కు గెలిచి భారత్‌ను ఫైనల్ చేర్చిన న్యూజిలాండ్..

by Mahesh |
లాస్ట్ బాల్‌కు గెలిచి భారత్‌ను ఫైనల్ చేర్చిన న్యూజిలాండ్..
X

దిశ, వెబ్‌డెస్క్: భారత జట్టు ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ (WTC) 2021-2023 ఫైనల్‌ చేరింది. ఇందుకు న్యూజిలాండ్ గెలుపు ముఖ్య కారణం అయింది. శ్రీలంకతో జరుగుతున్న మొదటి టెస్ట్ మ్యాచ్ లో ఐదో రోజు చివరి బంతి న్యూజిలాండ్ జట్టు గెలిచింది. దీంతో భారత్ WTC ఫైన్ చేరింది. WTC పాయింట్ల పట్టికలో ఆస్ట్రేలియా మొదటి స్థానంలో ఉండగా.. భారత్ రెండో స్థానంలో ఉంది.

కాగా మూడో స్థానంలో ఉన్న శ్రీలంక జట్టు న్యూజిలాండ్ తో జరుగుతున్న టెస్ట్ సిరీస్‌ను క్లీన్ స్వీప్ చేస్తే పాయింట్ల పట్టికలో రెండో స్థానానికి వచ్చే అవకాశం ఉండేది. అప్పుడు భారత్ ఆస్ట్రేలియా జట్టుతో జరుగుతున్న నాలుగో టెస్టులో కచ్చితంగా గెలవాల్సి వచ్చి ఉండేది. కానీ ప్రస్తుతం న్యూజిలాండ్ గెలవడంతో భారత్ ఊపిరి పీల్చుకుని.. టెస్ట్ ఛాంపియన్ షిప్ ఫైనల్ చేరుకుంది. కాగా WTC ఫైనల్ మ్యాచ్ జూన్ 7 నుండి ఓవల్‌లో జరగనుంది. కాగా ఈ WTC ప్రారంభ ఎడిషన్ లో భారత్ రన్నరప్‌గా నిలిచింది.

Advertisement

Next Story

Most Viewed