భారత ఒలంపిక్ క్రీడాకారులతో ప్రధాని సమావేశం

by M.Rajitha |
భారత ఒలంపిక్ క్రీడాకారులతో ప్రధాని సమావేశం
X

దిశ, వెబ్ డెస్క్ : భారత ఒలంపిక్ క్రీడాకారులతో ప్రధాని నరేంద్ర మోదీ సమావేశమయ్యారు. గురువారం తన నివాసంలో క్రీడాకారులను కలిసిన మోదీ.. వారికి అభినందనలు తెలియజేశారు. కాసేపు వారితో సరదాగా ముచ్చటించారు. ఈ సందర్భంగా క్రీడాకారులు వారు సాధించిన పతకాలు ప్రధానికి చూపించారు. వరుసగా రెండోసారి ఒలంపిక్స్ లో కాంస్యం సాధించిన హాకీ జట్టు ఆటగాళ్ళంతా సంతకం చేసిన ఓ జెర్సీని, హాకీ స్టిక్ ను ప్రధానికి బహుమతిగా ఇచ్చారు. షూటర్ మను బాకర్ తను ఒలంపిక్స్ లో ఉపయోగించిన పిస్టల్ ను ప్రధానికి చూపించింది. అనంతరం ప్రధాని మాట్లాడుతూ.. పారిస్ ఒలంపిక్స్ లో యువ ఆటగాళ్ళంతా మన దేశపు జెండాను రెపరెపలాడించారని క్రీడాకారులను కొనియాడారు. 140 కోట్ల మంది భారతీయుల తరపున మీ అందరికీ అభినందనలు తెలియజేస్తున్నాను అన్నారు. కొత్త కలలు, ఆశయాలతో మీరంతా ముందుకు వెళ్లాలని ఆశిస్తున్నాను అని ప్రధాని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కేంద్ర క్రీడల మంత్రి మన్సుఖ్ మాండవీయ, భారత ఒలంపిక్ సంఘం అధ్యక్షురాలు పీటీ ఉష పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed