టీ20ల్లో నం.1 ర్యాంక్‌ను కాపాడుకున్న సూర్య.. నం.1 ఆల్‌రౌండర్‌‌గా ఆ సీనియర్ ఆటగాడు

by Harish |
టీ20ల్లో నం.1 ర్యాంక్‌ను కాపాడుకున్న సూర్య.. నం.1 ఆల్‌రౌండర్‌‌గా ఆ సీనియర్ ఆటగాడు
X

దిశ, స్పోర్ట్స్ : టీమ్ ఇండియా స్టార్ బ్యాటర్ సూర్యకుమార్ టీ20ల్లో నం.1 స్థానాన్ని నిలబెట్టుకున్నాడు. ఐర్లాండ్, పాక్ మ్యాచ్‌ల్లో విఫలమవడం అతని ర్యాంక్‌‌పై ఎలాంటి ప్రభావం చూపలేదు. ఐసీసీ బుధవారం టీ20 ర్యాంకింగ్స్‌ను రిలీజ్ చేసింది. బ్యాటింగ్ విభాగంలో సూర్య 837 రేటింగ్ పాయింట్లతో అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. యశస్వి జైశ్వాల్ 6వ స్థానాన్ని కాపాడున్నాడు. విరాట్ రెండు స్థానాలు కోల్పోయి 48వ ర్యాంక్‌కు పడిపోగా.. కెప్టెన్ రోహిత్ 49వ స్థానంలో ఉన్నాడు. అక్షర్ పటేల్ బౌలింగ్ విభాగంలో 4 స్థానాలు కోల్పోయి 7వ ర్యాంక్‌కు పడిపోగా.. ఆల్‌రౌండర్‌గా మూడు స్థానాలు ఎగబాకాడు. స్టార్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా ఒక్క స్థానం మెరుగుపర్చుకుని 8వ స్థానానికి చేరుకున్నాడు.

తాజా ర్యాంకింగ్స్‌లో అఫ్ఘనిస్తాన్, బంగ్లాదేశ్ క్రికెటర్లు ర్యాంక్‌లను గణనీయంగా మెరుగుపర్చుకున్నారు. ఆల్‌రౌండర్ విభాగంలో అఫ్గాన్‌కు చెందిన మహ్మద్ నబీ రెండు స్థానాలను అధిగమించి అగ్రస్థానానికి చేరుకున్నాడు. బ్యాటింగ్‌ విభాగంలో అఫ్గాన్ ఓపెనర్ గుర్బాజ్ 8 స్థానాలు, బంగ్లా బ్యాటర్ తౌహిద్ హృదోయ్ ఏకంగా 32 స్థానాలు ఎగబాకారు. బౌలింగ్ విభాగంలో అఫ్గాన్ బౌలర్లు రషీద్ ఖాన్, ఫజల్హక్ ఫరూఖీ 3వ, 4వ స్థానాలకు ఎగబాకగా.. బంగ్లా బౌలర్లు ముస్తాఫిజుర్ రెహ్మాన్ 10వ స్థానాలు, తస్కిన్ అహ్మద్ 8 స్థానాలు అధిగమించారు.

Advertisement

Next Story

Most Viewed