రిటైర్మెంట్ ప్రకటించిన ముంబై స్టార్ క్రికెటర్

by Mahesh |
రిటైర్మెంట్ ప్రకటించిన ముంబై స్టార్ క్రికెటర్
X

దిశ, వెబ్‌డెస్క్: భారత క్రికెట్ జట్టు మాజీ ప్రేయర్, ముంబై స్టార్ క్రికెటర్.. సౌరభ్ తివారీ ప్రొఫెషనల్ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించాడు. ప్రస్తుతం రంజీ ట్రోఫీలో జార్ఖండ్ తరఫున ఆడుతున్న 34 ఏళ్ల తివారి ఈ నిర్ణయాన్ని ప్రకటించారు. 11 సంవత్సరాల వయసులో క్రికెట్ లోకి వచ్చిన అతను 2006-2007 సంవత్సరంలో రంజీ ట్రోఫీ సీజన్‌లో ఫస్ట్-క్లాస్ అరంగేట్రం చేసాడు. 2008 విరాట్ కోహ్లీ కెప్టెన్ గా ఉన్న సమయంలో అండర్-19 ప్రపంచ కప్‌ను గెలుచుకున్నాడు. 2010లో ఐపీఎల్ జట్టులోకి అరంగేట్రం చేసిన అతను.. ముంబై ఇండియన్స్ తరఫున అతను 419 పరుగులు చేశాడు. దీంతో జూన్‌లో జరిగిన ఆసియా కప్‌కు భారత జట్టులో చోటు దక్కింది.

కాగా సౌరబ్ తివారీ దేశవాలీ క్రికెట్‌ అయిన రంజీ ట్రోఫీలోనే అత్యదికంగా రాణించాడు. 17 ఏళ్లలో 115 ఫస్ట్-క్లాస్ మ్యాచ్‌లలో 189 ఇన్నింగ్స్‌లలో 47.51 సగటుతో 22 సెంచరీలు, 34 అర్ధసెంచరీలతో సహా 8030 పరుగులు చేశాడు. సోమవారం జంషెడ్‌పూర్‌లోని కీనన్ స్టేడియంలో మ్యాచ్ అనంతరం విలేకరుల సమావేశంలో తివారీ మాట్లాడుతూ.. "నేను పాఠశాల విద్యకు ముందు ప్రారంభించిన ఈ ప్రయాణానికి వీడ్కోలు పలకడం కొంచెం కష్టం. "అయితే దీనికి ఇదే సరైన సమయమని నేను కూడా ఖచ్చితంగా అనుకుంటున్నాను. జాతీయ జట్టు, ఐపిఎల్‌లో లేకుంటే, రాష్ట్ర జట్టులో యువకుడికి స్థానం కల్పించడం మంచిదని నేను భావిస్తున్నాను. మా టెస్టు జట్టులో అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి నేను ఈ నిర్ణయం తీసుకుంటున్నానని ప్రకటించారు.

2014 భుజం గాయం కారణంగా ఐపీఎల్ కు దూరం కాకముందు.. ఢిల్లీ డేర్‌డెవిల్స్, రైజింగ్ పూణే సూపర్‌జెయింట్‌ జట్లకు ప్రాతినిద్యం వహించాడు. ఆ తర్వాత 2021 సంవత్సరంలో తిరిగి ముంబై జట్టులోకి రావడం తో ఐపీఎల్ లోకి వచ్చాడు. తివారీ 28.73 సగటుతో 1494 పరుగులతో, 120 స్ట్రైక్ రేట్‌తో పూర్తి చేశాడు. మొత్తం మీద, అతను 29.02 సగటుతో 16 అర్ధ సెంచరీలతో 3454 T20 పరుగులు, 122.17 స్ట్రైక్ రేట్‌తో పూర్తి చేశాడు. అతను ఫార్మాట్లలో తన రాష్ట్రానికి 88 సార్లు కెప్టెన్‌గా ఉన్నాడు. అందులో 36 గెలిచాడు. 33 ఓడిపోయాడు. 19 డ్రా చేశారు. అతను ఏడు సార్లు ఈస్ట్ జోన్‌కు నాయకత్వం వహించాడు.

Advertisement

Next Story

Most Viewed