ముసలోడు మాహీ.. ధోనీపై సెహ్వాగ్ కామెంట్స్..!

by Dishanational6 |
ముసలోడు మాహీ.. ధోనీపై సెహ్వాగ్ కామెంట్స్..!
X

దిశ,స్పోర్ట్స్: ఎంఎస్ ధోనిపై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు వీరేంద్ర సెహ్వాగ్. ఐపీఎల్ 2024 సీజన్‌కి కామెంటేటర్‌గా వ్యవహరిస్తున్నాడు వీరేంద్ర సెహ్వాగ్. అయితే, గుజరాత్ టైటాన్స్‌- చెన్నై సూపర్ కింగ్స్ మధ్య జరిగిన మ్యాచ్‌లో ధోనీ అద్భుతమైన క్యాచ్ పెట్టాడు. ధోని పట్టిన క్యాచ్‌ గురించి చెబుతూ ‘ముసలోడు మాహీ’ అంటూ సెహ్వాగ్ కామెంట్స్ చేశాడు. మ్యాచ్ తర్వాత చెన్నై సూపర్ కింగ్స్ విజయాల గురించి విశ్లేసిస్తూ మాట్లాడాడు సెహ్వాగ్.

‘మ్యాచులు గెలవడానికి క్యాచులు పట్టాలి. అజింకా రహానే చాలా మంచి క్యాచ్ అందుకున్నాడు. మ్యాచుల్లో పరుగులు చేయకపోయినా ఫీల్డింగ్ లో మ్యాజిక్ చేస్తున్నాడు. సీఎస్కే విజయాల్లో రహానే పాత్ర ఉందని కొనియాడాడు. రచిన్ రవీంద్ర చురుగ్గా ఫీల్డింగ్ చేస్తున్నాడు.. మంచి క్యాచ్ లు పట్టాడు. ఇక ముసలోడు ఎంఎస్ ధోని గాల్లోకి ఎగురుతూ స్టన్నింగ్ క్యాచ్ అందుకున్నాడు’.. అంటూ కామెంట్ చేశాడు సెహ్వాగ్.

దీంతో అక్కడే ఉన్న రోహాన్ గవాస్కర్ సెహ్వాగ్ కు కౌంటర్ ఇచ్చాడు. ‘రహానేని ఎందుకని ముసలోడు అనలేదు?’ అని అడిగాడు. దానికి వీరూ తనస్టైల్లో ఆన్సర్ ఇచ్చాడు. ‘ధోనీ, అజింకా రహానే ఇద్దరిదీ ఓకే ఏజ్ కాదు. ధోనీ కన్నా రెహానే ఫిట్ గా ఉన్నాడు. రహానే ఒకే బాల్ క్ 4 పరుగులు చేయగలడు. అలాంటి ఫిట్ నెస్ తక్కువ మందికి ఉంటుంది. 35కి, 42కి మధ్య చాలా ఏజ్ గ్యాప్ ఉంది. ధోనీ ముసలోడు అయ్యాడు. అందులో ఎవరికీ డౌట్స్ అవసరం లేదు’.. అని చెప్పుకొచ్చాడు.

ఇకపోతే, ఈ సీజన్ ప్రారంభంలోనే సీఎస్కే కెప్టెన్ గా ధోనీ తప్పుకున్నాడు. ప్రస్తుతం గైక్వాడ్ కెప్టెన్ గా కొనసాగుతున్నాడు. ఆడిన రెండు మ్యాచ్ ల్లో కెప్టెన్ గా గైక్వాడ్ తనదైన మార్క్ చూపించాడు. సీఎస్కేకి వరుసగా రెండు విజయాలు అందించాడు.


Next Story