IPL 2025 MS Dhoni: ధోని రిటైర్ అవ్వబోతున్నాడా? షాక్‌ ఇచ్చిన BCCI

by Vennela |
IPL 2025 MS Dhoni: ధోని రిటైర్ అవ్వబోతున్నాడా? షాక్‌ ఇచ్చిన BCCI
X

దిశ,వెబ్‌డెస్క్: IPL 2025 MS Dhoni: BCCI మహేంద్ర సింగ్ ధోని గురించి ఒక పోస్ట్‌ను షేర్ చేసింది. ఈ పోస్టుతో ఎంఎస్ ధోనీకి ఇది వీడ్కోలు సీజన్ అవుతుందనే ఊహాగానాలు మొదలయ్యాయి.

ఫిబ్రవరి 16 ఆదివారం నాడు ఇండియన్ ప్రీమియర్ లీగ్ 18వ సీజన్ షెడ్యూల్‌ను BCCI ప్రకటించింది. IPL 2025 మొదటి మ్యాచ్ కోల్‌కతా నైట్ రైడర్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మధ్య జరుగుతుంది. రెండవ మ్యాచ్ చెన్నై సూపర్ కింగ్స్, ముంబై ఇండియన్స్ మధ్య జరుగుతుంది. అయితే తాజాగా బీసీసీఐ ఎంఎస్ ధోనీ గురించి ఆసక్తికర పోస్టును షేర్ చేసింది. ఈ పోస్టుతో ధోనికి ఇదే చివరి సీజన్ అవుతుందని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. బీసీసీఐ(BCCI) తన ఖాతాలో ఎంఎస్ ధోని ఫోటోను సోషల్ మీడియాలో షేర్ చేసింది. థాల చెపాక్‌కు తిరిగి వచ్చారు. ఎంఎస్ ధోని (MS Dhoni)వీడ్కోలు ఐపీఎల్ సీజన్ మార్చి 23న చిరకాల ప్రత్యర్థి ముంబై ఇండియన్స్‌(Mumbai Indians)తో జరిగే బ్లాక్‌బస్టర్ మ్యాచ్‌తో ప్రారంభమవుతుంది. ఐపీఎల్ 2025(IPL 2025)లో అధ్యాయం ప్రారంభమవుతుంది. మీరు సిద్ధంగా ఉన్నారా?" అనే క్యాప్షన్‌లో రాశారు.

ఎంఎస్ ధోని(MS Dhoni) 2020 లో అంతర్జాతీయ క్రికెట్ నుంచి రిటైర్ అయ్యారు. అప్పటి నుంచి ఐపీఎల్ (IPL)లో కొనసాగుతున్నారు. 43 ఏళ్ల ధోని గురించి ఇది అతని చివరి సీజన్ కావచ్చని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఇలాంటి రూమర్స్ రావడం ఇదే మొదటిసారి కాదు. ప్రతి ఏడాది ధోనికి ఇదే చివరి సీజన్ అంటూ వార్తలు వస్తున్నాయి. ఇలాంటి రూమర్స్ వచ్చిన ప్రతిసారి..అవన్నీ ఊహాగానాలే అంటూ ధోని నిరూపించాడు. అయితే ఈ పోస్టు పెట్టింది బీసీసీఐ ఒరిజనల్‌ అకౌంట్‌ నుంచి కాదు.. డమ్మీ అకౌంట్‌(Dummy account) నుంచి.దీంతో ఫ్యాన్స్‌ గందరగోళానికి గురయ్యారు.


ఈసారి ఎంఎస్ ధోని(MS Dhoni) ఐపీఎల్ జీతం రూ.4 కోట్లు మాత్రమే కావడం గమనించదగ్గ విషయం. BCCI ఓ పాత నియమాన్ని మళ్లీ అమలు చేసింది.దీన్ని 2008 సంవత్సరంలో అమలు చేసింది. తర్వాత నిలిపివేసింది. కానీ ఇప్పుడు బీసీసీఐ(BCCI) మళ్ళీ ఆ నియమాన్ని అమలు చేసింది. ఈ నియమం ప్రకారం, 5 సంవత్సరాలు అంతర్జాతీయ క్రికెట్(International cricket) ఆడని ఆటగాడు, అంటే 5ఏళ్లు అంతర్జాతీయ క్రికెట్ నుండి రిటైర్ అయిన ఆటగాడు, IPLలో అన్‌క్యాప్డ్ ప్లేయర్ (Uncapped player)అవుతాడు. ఈ కారణంగా, ధోనిని అన్‌క్యాప్డ్ ప్లేయర్‌గా ఉంచారు. అతనికి రూ. 4 కోట్ల జీతం లభిస్తుంది.

Next Story