- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ధోనీ, కోహ్లీలకు కాదు.. ఆ క్రికెటర్‌కు వీరాభిమానిని : పారాలింపిక్స్ గోల్డ్ మెడలిస్ట్ నవ్‌దీప్ సింగ్
దిశ, స్పోర్ట్స్ : ఇటీవల పారిస్ పారాలింపిక్స్‌లో భారత పారా జావెలిన్ త్రోయర్ నవ్‌దీప్ సింగ్ సంచలన ప్రదర్శన చేసిన విషయం తెలిసిందే. పురుషుల జావెలిన్ త్రో ఎఫ్41 ఈవెంట్‌లో బంగారు పతకం సాధించాడు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న నవ్‌దీప్ తన ఫేవరెట్ క్రికెటర్ ఎవరో రివీల్ చేశాడు. ధోనీనా? లేదా విరాట్ కోహ్లీనా? అని ప్రశ్నించగా అతను టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ పేరు చెప్పాడు. రోహిత్‌కు తాను వీరాభిమానినని తెలిపాడు.
‘అతను అద్భుతంగా ఆడతాడు. అతను డబుల్ సెంచరీ చేశాడు. అదో అద్భుతమైన ఇన్నింగ్స్. అప్పటి నుంచి రోహిత్‌కు ఫ్యాన్ అయిపోయా. విరాట్ కోహ్లీ గొప్ప ఆటగాడు. కానీ, నా ఫేవరెట్ మాత్రం రోహితే.’ అని నవ్‌దీప్ చెప్పుకొచ్చాడు. కాగా, పారాలింపిక్స్‌లో నవ్‌దీప్‌కు అనూహ్యంగా స్వర్ణం దక్కింది. మొదట అతను 47.32 మీటర్ల త్రోతో రజతం గెలుచుకున్నాడు.
ఇరాన్ అథ్లెట్ బీట్ సదేగ్(47.64 మీటర్లు) స్వర్ణం సాధించగా.. నిబంధనలు ఉల్లంఘించిన కారణంగా నిర్వాహకులు అతన్ని అనర్హుడిగా ప్రకటించారు. దీంతో రెండో స్థానంలో ఉన్న నవ్‌దీప్‌కు బంగారు పతకం దక్కింది.మరోవైపు, వన్డేల్లో రోహిత్ మూడు డబుల్ సెంచరీలు బాదాడు. 2013లో ఆసిస్(209)పై, 2014, 2017లలో శ్రీలంక(264, 208 నాటౌట్)పై ద్విశతకం చేశాడు.