- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
ధోనీ పొలిటికల్ ఎంట్రీ?.. అక్కడి నుంచే పోటీ చేస్తాడా?.. బీసీసీఐ వైస్ ప్రెసిడెంట్ ఏమన్నాడంటే?

దిశ, స్పోర్ట్స్ : టీమ్ ఇండియా మాజీ కెప్టెన్ ఎం.ఎస్ ధోనీకి ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇప్పటికీ అతని క్రేజ్ ఏమాత్రం తగ్గలేదు. ధోనీ పొలిటికల్ ఎంట్రీపై పలు వార్తలు వస్తున్నాయి. లోక్‌సభకు పోటీ చేస్తాడని ప్రచారం జరుగుతుంది. దీనిపై ధోనీ స్పందించాల్సి ఉంది. అయితే, ధోనీ పొలిటికల్ ఎంట్రీ వార్తలపై బీసీసీఐ వైస్ ప్రెసిడెంట్ రాజీశ్ శుక్లా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
ఓ యూట్యూబ్ చానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ.. రాజకీయాల్లోనూ ధోనీ రాణించగలడని వ్యాఖ్యానించాడు. ‘ధోనీ పొలిటిషియన్‌గా మారతాడని అనుకుంటున్నా. అయితే, అది అతని ఇష్టం. ధోనీ బెంగాల్ రాజకీయాల్లోకి వస్తాడని నేను గంగూలీ అనుకుంటున్నాం. పాలిటిక్స్‌లోనూ అతను రాణించగలడు. అతనికి ఉన్న ప్రజాదరణకు ధోనీ సులభంగా గెలుస్తాడు. అయితే, అతను రాజకీయాల్లోకి వస్తాడా?లేదా? అన్నది నాకు తెలియదు. అది అతని చేతుల్లోనే ఉంది. గతంలో లోక్‌సభకు పోటీచేయబోతున్నట్టు నాకు తెలిసింది. అతన్ని అడిగితే లేదని చెప్పాడు.’ అని రాజీవ్ శుక్లా చెప్పుకొచ్చారు. కాగా, ధోనీ 2019లో అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించిన విషయం తెలిసిందే. ప్రస్తుతం అతను ఐపీఎల్ మాత్రమే ఆడుతున్నాడు. వచ్చే సీజన్ కోసం చెన్నయ్ సూపర్ కింగ్స్ అతన్ని అన్‌క్యాప్డ్ ప్లేయర్‌గా అంటిపెట్టుకున్న సంగతి తెలిసిందే.
- Tags
- #MS Dhoni