- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
ఐపీఎల్-18 ముగియగానే ధోనీ రిటైర్మెంట్.. ఇదిగో హింట్ ఇచ్చేశాడు!

- ప్రీ సీజన్ క్యాంప్‌లో పాల్గొననున్న ఎంఎస్‌డీ
- లోకల్ ప్లేయర్లతో క్యాంపు నిర్వహించనున్న సీఎస్కే
- ధోనీకి ఇదే లాస్ట్ సీజనా?
దిశ, స్పోర్ట్స్: ఐపీఎల్ 18వ సీజన్ మార్చి 22 నుంచి ప్రారంభం కానుండటంతో అన్ని జట్లు సన్నాహక శిబిరాలను ఏర్పాటు చేస్తున్నాయి. చెన్నై సూపర్ కింగ్స్ (సీఎస్కే) జట్టు కూడా ఐపీఎల్ 2025కి సంబంధించి ప్రీ సీజన్ క్యాంప్ ఏర్పాటు చేసింది. ఈ క్యాంప్‌లో పాల్గొనడానికి సీఎస్కే మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీ బుధవారం చెన్నైకి చేరుకున్నాడు. చెన్నై ఎయిర్ పోర్టు నుంచి భారీ సెక్యూరిటీ మధ్య ధోనీ హోటల్ రూమ్‌కు చేరుకున్నాడు. ఈ సందర్భంగా సీఎస్కే జట్టు తమ సోషల్ మీడియా హ్యాండిల్‌లో 'తలా దర్శనం' పేరుతో పోస్టు చేసింది. ఇక బుధవారం ఉదయమే సీఎస్కే కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ కూడా చెన్నైకి చేరుకున్నాడు. ఈ వారంలోనే స్థానిక క్రికెటర్లతో సన్నాహక శిబిరాన్ని నిర్వహించారు. ఫాస్ట్ బౌలర్ గుర్జన్‌ప్రీత్ సింగ్, ఆండ్రీ సిద్ధార్థ్, ఖలీల్ అహ్మద్, అన్షుల్ కాంబోజ్, కమలేశ్ నాగర్‌కోటి కూడా చెన్నైకి చేరుకున్నారు. కాగా, 2024 సీజన్‌లో డిఫెండింగ్ చాంపియన్‌గా బరిలోకి దిగిన సీఎస్కే.. ఐదో స్థానంతో సరిపెట్టుకోవల్సి వచ్చింది. దీంతో ఈ సారి సన్నాహక శిబిరాన్ని ఎంఎస్ ధోనీ దగ్గరుండి పర్యవేక్షించనున్నాడు. 2020లో ఎంఎస్‌డీ అంతర్జాతీయ క్రికెట్‌కు గుడ్ బై చెప్పాడు. అప్పటి నుంచి కేవలం ఐపీఎల్ మాత్రమే ఆడుతున్నాడు. 'రెండు నెలల పాటు క్రికెట్ ఆడటానికి ఏడాదంతా ఫిట్‌నెస్ కాపాడుకుంటూనే ఉన్నాను' అని ఇటీవలే ధోనీ వ్యాఖ్యానించాడు. రెండో నెలల కోసం ఆరు నుంచి ఎనిమిది నెలలు ధోనీ ఫిట్‌నెస్ కోసం కష్టపడుతున్నాడు.
వన్ లాస్ట్ టైం..
గతేడాది ధోనీ ఐపీఎల్ నుంచి కూడా రిటైర్ అవుతారనే ప్రచారం జరిగింది. కానీ సీఎస్కే జట్టు అన్‌క్యాప్డ్ ప్లేయర్ కేటగిరీలో ధోనీని రూ.4 కోట్లకు కొనుగోలు చేసింది. దీంతో ఈ సారి కూడా ధోనీ ఐపీఎల్‌లో కనపడనున్నాడు. అయితే బుధవారం చెన్నై ఎయిర్ పోర్టుకు ధోనీ వేసుకొచ్చిన టీ-షర్ట్ మీద ఉన్నది చూసి ఫ్యాన్స్ కంగారుపడుతున్నారు. మోర్స్ కోడ్ రూపంలో ఉన్న దాన్ని.. చాట్ జీపీటీ, డీపీ సీక్‌లలో టైప్ చేసి చూడగా 'వన్ లాస్ట్ టైం' అనే అర్థాన్ని చూపిస్తుంది. దీంతో ధోనీ ఈ సీజన్ ముగిసిన తర్వాత రిటైర్ అవుతాడని సోషల్ మీడియాలో టాపిక్ నడుస్తుంది. ధోనీ వేసుకున్నటీ-షర్ట్‌లోని మోర్స్ కోడ్‌తో తన నిర్ణయాన్ని చెప్పేశాడని ఫ్యాన్స్ చర్చించుకుంటున్నారు.