- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
సిరాజ్‌కు రెస్ట్.. అవేశ్ రీఎంట్రీ
దిశ, స్పోర్ట్స్ : ఇంగ్లాండ్‌తో రెండో టెస్టుకు టీమ్ ఇండియా స్టార్ పేసర్ మహ్మద్ సిరాజ్ దూరమయ్యాడు. శుక్రవారం మ్యాచ్ ప్రారంభానికి ముందు భారత జట్టు నుంచి బీసీసీఐ అతన్ని రిలీజ్ చేసింది. ఈ విషయాన్ని బోర్డు ఎక్స్ వేదికగా ధ్రువీకరించింది. సిరీస్ వ్యవధి, ఇటీవల అతను ఆడిన క్రికెట్‌ను దృష్టిలో ఉంచుకుని రెండో టెస్టుకు అతనికి విశ్రాంతిని ఇచ్చినట్టు తెలిపింది. రాజ్‌కోట్ వేదికగా జరిగే మూడో టెస్టుకు అతను అందుబాటులో ఉంటాడని పేర్కొంది. అలాగే, సిరాజ్ స్థానంలో యువ పేసర్ అవేశ్ ఖాన్‌ను జట్టులోకి తీసుకుంది. అయితే, రెండో టెస్టులో భారత తుది జట్టులో అవేశ్ ఖాన్‌కు చోటు దక్కలేదు. బుమ్రాకు తోడుగా ముకేశ్ కుమార్‌కు స్థానం దక్కింది.
కాగా, హైదరాబాద్ వేదికగా జరిగిన తొలి టెస్టులో హోం గ్రౌండ్‌లో సిరాజ్ ఆకట్టుకోలేకపోయాడు. పిచ్ స్పిన్‌కు అనుకూలించడంతో కెప్టెన్ రోహిత్.. అశ్విన్, జడేజా, అక్షర్‌లకే బౌలింగ్ ఇచ్చాడు. పేస్ విభాగంలో బుమ్రాపైనే ఆధారపడ్డాడు. దీంతో సిరాజ్‌కు ఎక్కువ బౌలింగ్ చేసే అవకాశం రాలేదు. ఆ మ్యాచ్‌ల్లో రెండు ఇన్నింగ్స్‌ల్లో కలిపి అతను 11 ఓవర్లు మాత్రమే వేశాడు. ఐదు టెస్టుల సిరీస్‌లో సెలెక్షన్ కమిటీ తొలి రెండు టెస్టులకు మాత్రమే భారత జట్టును ప్రకటించిన విషయం తెలిసిందే. మిగతా మూడు టెస్టులకు త్వరలోనే జట్టును ప్రకటించనుంది.