- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
మీ జ్ఞానాన్ని మీ వద్దే ఉంచుకోండి.. మాజీ క్రికెటర్‌కు షమీ కౌంటర్
దిశ, స్పోర్ట్స్ : త్వరలో జరగబోయే ఐపీఎల్ వేలంలో ప్రధాన ఆకర్షణగా నిలిచే ఆటగాళ్లలో భారత స్టార్ పేసర్ మహ్మద్ షమీ కూడా ఉంటాడనడంలో సందేహం అక్కర్లేదు. రూ. 2 కోట్ల కనీస ధరతో అతను వేలంలోకి రానున్నాడు. తాజాగా షమీపై భారత మాజీ క్రికెటర్ సంజయ్ మంజ్రేకర్ కీలక వ్యాఖ్యలు చేశాడు. వేలంలో షమీ విలువ బాగా తగ్గుతుందన్నాడు. గాయాల బారిన పడటం, కోలుకునేందుకు ఎక్కువ సమయం తీసుకోవడం అతని వేలంపై ప్రభావం చూపుతాయని అంచనా వేశాడు. సంజయ్ మంజ్రేకర్ వ్యాఖ్యలపై షమీ ఘాటుగా స్పందించాడు. ‘మీ మీ జ్ఞానాన్ని మీ వద్దే ఉంచుకోండి’ అంటూ కౌంటర్ ఇచ్చాడు. ‘బాబా కీ జయహో. మీ జ్ఞానాన్ని మీ వద్దే ఉంచుకోండి. సంజయ్ జీ భవిష్యత్తులో మీకు సహాయపడుతుంది. ఫ్యూచర్ ఎవరికైనా తెలుసా?.’ అని షమీ ఇన్‌స్టాగ్రామ్‌లో రాసుకొచ్చాడు. కాగా, గతేడాది వన్డే వరల్డ్ కప్ తర్వాత గాయం, సర్జరీ కారణంగా ఏడాదిపాటు షమీ ఆటకు దూరంగా ఉన్నాడు. పూర్తిగా కోలుకున్న అతను ఇటీవల రంజీ ట్రోఫీలో రీఎంట్రీ ఇచ్చి సత్తాచాటాడు. దీంతో బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ కోసం షమీని ఆస్ట్రేలియాకు పంపే అవకాశం ఉంది.