Manoj Tiwary: భారత క్రికెటర్‌ సంచలన నిర్ణయం.. రిటైర్మెంట్‌ వెనక్కి!

by Vinod kumar |   ( Updated:2023-08-08 15:26:02.0  )
Manoj Tiwary: భారత క్రికెటర్‌ సంచలన నిర్ణయం.. రిటైర్మెంట్‌ వెనక్కి!
X

దిశ, వెబ్‌డెస్క్: టీమిండియా క్రికెటర్‌, బెంగాల్ క్రీడా మంత్రి మనోజ్‌ తివారి తన రిటైర్మెంట్‌ నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్నాడు. బెంగాల్‌ క్రికెట్‌ ఆసోషియేషన్‌ చైర్మెన్‌ స్నేహసిస్ గంగూలీ సూచన మెరకు మనోజ్ తన నిర్ణయాన్ని మార్చుకున్నాడు. ఈ విషయాన్ని మనోజ్‌ తివారి మంగళవారం విలేకరుల సమావేశంలో అధికారింగా వెల్లడించనున్నట్లు తెలుస్తోంది. అయితే మనోజ్‌ తివారీ గత ఆగస్టు 3 న అన్ని రకాల ఫార్మాట్‌ల నుంచి తప్పు​కుంటున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. ​కాగా గత కొన్నేళ్లుగా బెంగాల్‌ జట్టులో కీలక ఆటగాడిగా కొనసాగుతున్నాడు. అంతేకాకుండా అతడి సారధ్యంలోని బెంగాల్‌ జట్టు గత రంజీ ట్రోఫీలో రన్నరప్‌గా నిలిచింది. తివారి తన నిర్ణయాన్ని వెనుక్కి తీసుకోవడంతో మళ్లీ వచ్చే ఏడాది రంజీ ట్రోఫీలో బరిలోకి దిగనున్నాడు.

ఇప్పటివరకు భారత్‌ తరఫున 12 వన్డేలు, మూడు టి20లు ఆడాడు. వన్డేల్లో ఒక సెంచరీ, అర్ధసెంచరీ ఉన్నాయి. కానీ మూడు టి20ల్లో ఒకసారి మాత్రమే బ్యాటింగ్‌ అవకాశం దక్కగా 15 పరుగులే చేశాడు. అయితే దేశవాళీ క్రికెట్‌లో మాత్రం అతడికి మంచి రికార్డు ఉంది. దేశవాళీ క్రికెట్‌లో 141 మ్యాచ్‌ల్లో 48.56 సగటుతో 9,908 పరుగులు చేశాడు. ఐపీఎల్‌లో కోల్‌కతా, పంజాబ్, రైజింగ్‌ పుణేలకు ఆడాడు.

Advertisement

Next Story

Most Viewed