Lanka Premier League: మ్యాచ్‌ మధ్యలో పాము కలకలం.. వీడియో వైరల్‌

by Vinod kumar |
Lanka Premier League: మ్యాచ్‌ మధ్యలో పాము కలకలం.. వీడియో వైరల్‌
X

దిశ, వెబ్‌డెస్క్: లంక ప్రీమియర్‌ లీగ్‌లో భాగంగా కొలంబో వేదికగా గాలె టైటాన్స్, దంబుల్లా ఆరా మధ్య జరిగిన మ్యాచ్‌లో ఊహించని ఘటన జరిగింది. దంబుల్లా జట్టు బ్యాటింగ్ చేస్తున్న సమయంలో పాము స్టేడియంలోకి ప్రవేశించింది. క్రీజులో ధనంజయ్ డిసిల్వా, కుశాల్ పెరీరా ఉన్నారు. ఇంతలోనే పాము మైదానంలోకి వచ్చినట్లు స్క్రీన్‌పై చూపించారు. దీంతో ఒక్క సారిగా ఆటగాళ్లు పామును చూసి ఉలిక్కిపడ్డారు. అంపైర్‌లు వెంటనే స్టేడియం భద్రతా సిబ్బందికి సమాచారం ఇవ్వగా.. పామును పట్టుకుని వెళ్లారు. ఈ క్రమంలో 10 నిమిషాల పాటు ఆట నిలిచిపోయింది. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ మ్యాచ్‌లో సూపర్‌ ఓవర్‌లో దంబుల్లాపై గాలే విజయం సాధించింది.

Advertisement

Next Story

Most Viewed