Babar Azam: చరిత్ర సృష్టించిన పాక్‌ కెప్టెన్‌..

by Vinod kumar |
Babar Azam: చరిత్ర సృష్టించిన పాక్‌ కెప్టెన్‌..
X

దిశ, వెబ్‌డెస్క్: లంక ప్రీమియర్‌ లీగ్‌-2023లో భాగంగా గాలే టైటాన్స్‌తో ఇవాళ జరిగిన మ్యాచ్‌లో సెంచరీ చెలరేగిన పాక్‌ కెప్టెన్‌ బాబర్‌ ఆజమ్‌ అత్యంత అరుదైన రికార్డును సొంతం చేసుకున్నాడు. ఈ ఫార్మాట్‌ (అంతర్జాతీయ మ్యాచ్‌లతో పాటు ప్రపంచవ్యాప్తంగా అన్ని లీగ్‌లు)లో 10 శతకాలు బాదిన రెండో బ్యాటర్‌ రికార్డుల్లోకెక్కాడు. అంతకుముందు విండీస్‌ క్రికెటర్ యూనివర్సల్‌ బాస్‌ క్రిస్‌ గేల్‌ మాత్రమే ఈ ఘనత సాధించాడు. గేల్‌ తన 463 మ్యాచ్‌ల టీ20 కెరీర్‌లో ఏకంగా 22 శతకాలు బాదాడు.

ప్రపంచవ్యాప్తంగా ఉన్న దాదాపు అన్ని టీ20 లీగ్‌లో పాల్గొన్న గేల్‌ 22 సెంచరీలతో పాటు 88 హాఫ్‌ సెంచరీలు బాది 14,562 పరుగులు చేశాడు. టీ20ల్లో అత్యధిక​ సెంచరీలు బాదిన ఆటగాళ్ల జాబితాలో గేల్‌, బాబర్‌ల తర్వాత క్లింగర్‌ (206 మ్యాచ్‌ల్లో 5960 పరుగులు, 8 సెంచరీలు), డేవిడ్‌ వార్నర్‌ (11695 పరుగులు, 8 సెంచరీలు), విరాట్‌ కోహ్లి (11965, 8), ఆరోన్‌ ఫించ్‌ (11392, 8) తొలి ఆరు స్థానాల్లో ఉన్నారు.

Advertisement

Next Story

Most Viewed