- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
రాహుల్ ఏం క్రైమ్ చేయలేదు.. వదిలేయండి : టీమిండియా మాజీ స్పిన్నర్
దిశ, వెబ్‌డెస్క్: టీమిండియా ఓపెనర్ కేఎల్ రాహుల్ ఫామ్ గురించి ప్రస్తుతం విపరీతంగా చర్చ జరుగుతోంది. టీమిండియా పేసర్ వెంకటేష్ ప్రసాద్, ఆకాశ్ చోప్రా మధ్య జరుగుతున్న డిబేట్ గురించి తెలిసిందే. ఈ విషయంపై టీమిండియా మాజీ స్పిన్నర్ హర్భజన్ సింగ్ స్పందించాడు. రాహుల్ ఎలాంటి క్రైమ్ చేయలేదని, అతడిని వదిలేయాలని ట్విటర్ వేదికగా తెలిపాడు. రాహుల్‌ను జట్టులో నుంచి తీసేయాలని వెంకటేష్ ప్రసాద్ అంటే.. రాహుల్‌ను టార్గెట్ చేస్తూ వ్యక్తిగత ఎజెండాతో మాట్లాడుతున్నారంటూ వెంకటేష్ ప్రసాద్‌కు చురకలంటించాడు ఆకాష్. ఈ అంశంపై హర్భజన్ సింగ్ స్పందించాడు. కేఎల్ రాహుల్‌ను ఒంటరిగా వదిలేయాలని తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు.
"గయ్స్.. కేఎల్ రాహుల్‌ను కాస్త ఒంటరిగా వదిలేస్తారా? అతడు ఎలాంటి నేరం చేయలేదు. అతడు ఇప్పటికీ టాప్ ప్లేయర్. బలంగా పునరాగమనం చేస్తాడు. ఇంటర్నేషనల్ క్రికెట్‌లో మనమందరం ఆ దశను, అడ్డంకులను దాటుకుని వచ్చినవాళ్లమే. అతడే ఫస్ట్ కాదు.. లాస్ట్ కాదు. కాబట్టి రాహుల్‌ను గౌరవించండి. అతడు మన సొంత ఆటగాడనే వాస్తవాన్ని మరువకూడదు. కాబట్టి నమ్మకముంచండి." అని హర్భజన్ సింగ్ తన ట్విటర్ వేదికగా స్పందించాడు.
ఈ విషయంపై ఆకాష్ చోప్రా మరో ట్వీట్ చేశాడు. తన సందేశాన్ని తప్పుగా అర్థం చేసుకున్నారని, సమస్య పరిష్కారానికి లైవ్ ఛాట్‌కు ఆహ్వానిస్తానని, అందులోకి రావాలని ట్వీట్ చేశాడు. అంతేకాకుండా ఇద్దరికి విభిన్న అభిప్రాయాలు ఉండొచ్చని, కానీ సరైన విధానంలో ఉండాలని సూచించారు. యూట్యూబ్‌లో తన మాటలు, వీడియోల వల్ల తనకు ఎలాంటి ప్రయోజనం లేదని, తన నెంబర్ మీ వద్ద ఉందని.. అవసరమైతే ఫోన్ చేయాలని ఆకాష్ చోప్రా తెలిపారు.
Can we leave @klrahul alone guys ? He hasn't done any crime.He is still a top player. He will come back strong.we all go thru such patches in international cricket.he is not the first one and last one. so please respect the fact that he is our own 🇮🇳 player and have faith 🙏
— Harbhajan Turbanator (@harbhajan_singh) February 21, 2023
No Aakash, nothing is lost in translation. In your 12 minute video you have called me as an agenda peddler because it didn't suit your narrative.
— Venkatesh Prasad (@venkateshprasad) February 21, 2023
It is crystal clear. And I have made my points very clear in this Twitter thread. Don't wish to engage with you further on this 🙏🏼 https://t.co/GhlfWI0kHA