- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
బుమ్రా లేకుండా ఆడటం నేర్చుకోండి : హర్భజన్ సింగ్ కీలక వ్యాఖ్యలు

దిశ, స్పోర్ట్స్ : భారత స్టార్ పేసర్ జస్ప్రిత్ బుమ్రా గాయం కారణంగా చాంపియన్స్ ట్రోఫీకి దూరమైన విషయం తెలిసిందే. బుమ్రా లేకపోవడం కచ్చితంగా భారత్‌కు లోటే. దీనిపై భారత మాజీ స్పిన్నర్ హర్భజన్ సింగ్ తన యూట్యూబ్ చానెల్‌లో స్పందించాడు. టీమిండియా చాంపియన్స్ ట్రోఫీ గెలవాలంటే బుమ్రా లేకుండా ఆడటం నేర్చుకోవాలని వ్యాఖ్యానించాడు. ‘చాంపియన్స్ ట్రోఫీలో టీమిండియానే ఫేవరెట్ అని ఇప్పటికీ నమ్ముతున్నా. మ్యాచ్‌లను గెలిపించే శక్తి బుమ్రా. అతని లేకపోయినా అర్ష్‌దీప్, షమీ, కుల్దీప్, జడేజా వంటి అనుభవజ్ఞులు ఉన్నారు. టోర్నీలో భారత్ ఫేవరెట్‌లాగే ఆడాలి. సామర్థ్యం ఉంది కాబట్టే టీమిండియాను ఫేవరెట్ అని చెబుతున్నా. రోహిత్ ఫామ్‌లోకి వచ్చాడు. కోహ్లీ పరుగులు చేస్తున్నాడు. గిల్, శ్రేయస్ అయ్యర్ మంచి ఫామ్‌లో ఉన్నారు. బ్యాటింగ్, బౌలింగ్ విభాగాలు రాణిస్తున్నాయి. అయితే, ఆఖరి రెండు ఓవర్లలో ప్రత్యర్థి చేతిలో రెండు లేదా మూడు వికెట్లు ఉండి కొన్ని పరుగులు చేయాల్సిన సమయంలో బుమ్రా లేకపోవడం ప్రభావం చూపుతుంది. అందుకే, టోర్నీ గెలవాలని అనుకుంటే బుమ్రా లేకుండా ఆడటం నేర్చుకోవాలనేది నా అభిప్రాయం.’అని హర్భజన్ సింగ్ చెప్పుకొచ్చాడు.