Kraigg Brathwaite : 52 ఏళ్ల రికార్డు బద్దలు కొట్టిన వెస్టిండీస్ ప్లేయర్ బ్రాత్‌వైట్

by Sathputhe Rajesh |
Kraigg Brathwaite : 52 ఏళ్ల రికార్డు బద్దలు కొట్టిన వెస్టిండీస్ ప్లేయర్ బ్రాత్‌వైట్
X

దిశ, స్పోర్ట్స్ : వెస్టీండిస్ ఆటగాడు క్రేగ్ బ్రాత్‌వైట్ ఓ అరుదైన రికార్డు సొంతం చేసుకున్నాడు. వరుసగా(గ్యాప్ లేకుండా) 86 టెస్టులు ఆడి గ్యారీ సొబెర్స్ పేరిట ఉన్న రికార్డును అధిగమించాడు.32 ఏళ్ల బ్రాత్‌వైట్ బంగ్లాదేశ్‌తో జమైకాలోని సబినా పార్క్‌లో జరుగుతున్న రెండో టెస్టు మ్యాచ్‌లో ఆడటం ద్వారా ఈ మైలురాయిని చేరుకున్నాడు. సొబెర్స్ వెస్టిండీస్ తరఫున 1955 నుంచి 1972 వరకు వరుసగా 85 టెస్టులు ఆడాడు. డెస్మాండ్ హైన్స్(72), బ్రియన్ లారా(64), రోహన్ కనహయ్(61), వివ్ రిచర్డ్స్(61), కోట్నీ వాల్ష్(53) టెస్టులు ఆడారు. ఓవరాల్‌గా ఇంగ్లాండ్ మాజీ కెప్టెన్ అలెస్టర్ కుక్ వరుసగా 159 టెస్ట్ మ్యాచ్‌లు ఆడి ఈ లిస్టులో టాప్‌లో ఉన్నాడు. మే 2006 నుంచి సెప్టెంబర్ 2018 వరకు జరిగిన అన్ని టెస్ట్ మ్యాచ్‌ల్లో ఆడి కుక్ ఈ రికార్డు నమోదు చేశాడు. అలెన్ బార్డర్(153), మార్క్ వా(153), సునీల్ గవాస్కర్(106), బ్రెండన్ మెక్ కలమ్(101), నాథన్ లయన్(100) ఈ లిస్టులో ముందున్నారు.

Advertisement

Next Story

Most Viewed