నాలుగో టెస్టులో వారిద్దరినీ ఆడించాలి.. ఆసీస్ మాజీ కెప్టెన్

by Vinod kumar |
నాలుగో టెస్టులో వారిద్దరినీ ఆడించాలి.. ఆసీస్ మాజీ కెప్టెన్
X

దిశ, వెబ్‌డెస్క్: అహ్మదాబాద్ వేదికగా ఆసీస్‌తో జరగనున్న నాలుగో టెస్టులో కేఎల్ రాహుల్, శుబ్‌మన్ గిల్ వీరిద్దరిలో ఎవర్నీ తుది జట్టులో తీసుకోవాలనే సందిగ్ధం పై ఆసీస్ మాజీ కెప్టెన్ రికీ పాంటింగ్ స్పందించాడు. కేఎల్ రాహుల్, శుబ్‌మన్ గిల్ ఇద్దరూ ఉండాలని రికీ పాంటింగ్ సూచించాడు. నాలుగు టెస్టుల సిరీస్‌లో టీమ్ ఇండియా రెండు మ్యాచ్‌ల్లో గెలిచిన విషయం తెలిసిందే. దీంతో సిరీస్ సొంతం చేసుకోవాలంటే నాలుగో టెస్టు తప్పకుండా భారత్ గెలవాల్సిందే. అయితే తొలి రెండు టెస్టుల్లోనూ విఫలమైన కేఎల్ రాహుల్‌ను మూడో టెస్టుకు పక్కన పెట్టి.. శుబ్‌మన్ గిల్‌కు అవకాశమివ్వగా.. అతడు రెండు ఇన్నింగ్స్‌ల్లోనూ రాణించలేదు. దీంతో తదుపరి మ్యాచ్‌లో వీరిద్దరిలో ఎవర్నీ తుది జట్టులో తీసుకోవాలనేది సందిగ్ధంగా మారింది. అంతేకాకుడా గిల్‌ను ఓపెనింగ్ ఆడించాలని.. రాహుల్‌ను మిడిలార్డర్‌లో దింపాలని రికీ పాంటింగ్ స్పష్టం చేశాడు.

గత మ్యాచ్‌లో కేఎల్ రాహుల్‌ను పక్కన పెట్టి శుబ్‌మన్ గిల్‌ను తీసుకున్నారు. ఇద్దరికీ కూడా టెస్టుల్లో అనుభవం ఉంది. కాబట్టి నాలుగో టెస్ట్‌లో ఇద్దరినీ జట్టులో తీసుకోవచ్చు రికీ పాంటింగ్ అభిప్రాయపడ్డాడు. శుబ్‌మన్ గిల్‌ను ఓపెనర్‌గా పంపి.. కేఎల్ రాహుల్‌ను మిడిలార్డర్‌లో ఆడించాలి. ఎందుకంటే ఇంగ్లాండ్‌తో సిరీస్‌లో అతడికి మిడిలార్డర్‌లో ఆడిన అనుభవం ఉందని రికీ పాంటింగ్ అన్నాడు. ఈ సిరీస్‌లో టీమిండియా 2-1 తేడాతో ముందుండగా.. చివరి టెస్టు మ్యాచ్ అహ్మదాబాద్ వేదికగా మార్చి 9 నుంచి ప్రారంభం కానుంది.

Advertisement

Next Story