2024 సీజన్‌లో కప్ సాధించిన కెప్టెన్‌, స్టార్ ఆల్ రౌండర్‌కు షాక్ ఇచ్చిన ఐపీఎల్ జట్టు

by Mahesh |   ( Updated:2024-10-30 12:47:11.0  )
2024 సీజన్‌లో కప్ సాధించిన కెప్టెన్‌, స్టార్ ఆల్ రౌండర్‌కు షాక్ ఇచ్చిన ఐపీఎల్ జట్టు
X

దిశ, వెబ్ డెస్క్: ప్రస్తుతం క్రికెట్ అభిమానుల దృష్టి మొత్తం ఐపీఎల్(IPL) రిటెన్షన్ పైనే ఉంది. గత సీజన్‌లో భారీ ప్రదర్శన కనబరిచిన ప్లేయర్లను వదులుకోవడం ఆయా జట్లకు ఇష్టం లేనప్పటికి భారీ ఇన్వెస్ట్మెంట్ చేయాలా వద్దా అనే ఆలోచనలో జట్లు ఉన్నాయి. ఈ క్రమంలో ఏ జట్లు ఏ ప్లేయర్లను రిటెన్షన్ ద్వారా అంటి పెట్టుకుంటాయని అభిమానులు ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు. ఈ క్రమంలో పలు క్రీడా న్యూస్ సంస్థలు ఆయా జట్ల రిటెన్షన్ ప్లేయర్ల లిస్టును అంచనా వేస్తున్నారు. ఈ క్రమంలోనే గత సీజన్లో చాంపియన్ గా నిలిచిన కలకత్తా నైట్ రైడర్స్ జట్టు.. కీలక ప్లేయర్లు షాక్ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. గత సీజన్లో జట్టుకు కప్ సాధించిన కెప్టెన్ శ్రేయస్ అయ్యర్(Shreyas Iyer), ఆల్ రౌండర్ రసూల్‌(Rasul)లను ఆ జట్టు వదిలిపెట్టనున్నట్లు వార్తలు వస్తున్నాయి. వీరితో పాటుగా గత సీజన్లో అత్యధిక ధరకు కొనుగోలు చేసిన మిచెల్ స్టార్క్(Mitchell Starc) ను కూడా వదిలేసేందుకు కేకేఆర్ సిద్దమైనట్లు తెలుస్తోంది. అలాగే కేకేఆర్ జట్టు వచ్చే రెండు సీజన్లకు‌గాను రింకూ సింగ్, సునీల్ నరైన్, వరుణ్ చక్రవర్తి, హర్షిత్ రాణా లను రిటైన్ చేసుకునేందుకు నిర్ణయం తీసుకుంది. ఆర్టీఎమ్ కింద వెంకటేష్ అయ్యర్ ను జట్టులోకి తీసుకొని శ్రేయస్ అయ్యర్, రసూల్, మిచెల్ స్టార్క్ లను వదిలేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. కాగా కేకేఆర్ వదిలేసే, రిటైన్ చేసుకునే ప్లేయర్లకు సంబంధించిన అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.

Advertisement

Next Story