Jio Hotstar: జియో హాట్‌స్టార్ ఆల్‌టైమ్ రికార్డ్.. ఎందుకో తెలుసా?

by Shiva |   ( Updated:2025-02-24 13:34:01.0  )
Jio Hotstar: జియో హాట్‌స్టార్ ఆల్‌టైమ్ రికార్డ్.. ఎందుకో తెలుసా?
X

దిశ, వెబ్‌డెస్క్: ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ-2025 (ICC Champions Trophy-2025)కి ఓటీటీ బ్రాడ్‌కాస్టర్‌ (OTT Broadcaster)గా వ్యవహరిస్తున్న జియో హాట్‌స్టార్ (Jio Hotstar) ఆల్‌టైమ్ రికార్డును నెలకొల్పింది. భారత్-పాకిస్థాన్ (India-Pakistan) మ్యాచ్ సందర్భంగా అత్యధిక వ్యూస్‌ను నమోదు చేసింది. ఈ మ్యాచ్‌లో రన్ మిషన్ విరాట్ కోహ్లీ (Virat Kohli) సెంచరీతో అదగొట్టాడు. ఫలితంగా జియో హాట్‌స్టార్ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా మ్యాచ్‌కు 61 కంకరెంట్ వ్యూస్ వచ్చాయి. అయితే, కంకరెంట్ వ్యూస్ అంటే ఒకే సమయంలో వచ్చే వ్యూస్ సంఖ్య. సింపుల్‌గా చెప్పాలంటే రియల్‌ టైమ్ యూజర్ల సంఖ్య. భారత్-పాకిస్థాన్ (India-Pakistan) మ్యాచ్‌ను ఏక కాలంలో 61 కోట్ల మంది జియో హాట్ స్టార్ యాప్ వేదికగా వీక్షించారు.

ఈ మ్యాచ్‌లో పాకిస్థాన్ (Pakistan) ముందుగా బ్యాటింగ్ చేయగా.. హాట్‌స్టార్ వ్యూస్ 10 కోట్లు ఉంది. పాక్ ఇన్నింగ్స్ చివర్లో ఈ సంఖ్య 40 కోట్లకు చేరగా.. భారత్ బ్యాటింగ్ సందర్భంగా 55 కోట్లకు చేరింది. విరాట్ కోహ్లీ శతకం సమయంలో 61 కోట్లకు పెరిగింది. ఇది ఓటీటీ యాప్ చరిత్రలోనే ఆల్‌టైమ్ రికార్డుగా విశ్లేషకులు చెబుతున్నారు. ఇదే టోర్నీలో భారత్ (India), బంగ్లాదేశ్ (Bangladesh) మధ్య జరుగిన మ్యాచ్‌లో గరిష్టంగా 35 కోట్ల వ్యూస్ వచ్చాయి. తాజాగా, భారత్-పాక్ మ్యాచ్ ఆ రికార్డ్‌ను తిరగరాసింది.

Next Story

Most Viewed