- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
రాంచీ చేరుకున్న భారత జట్టు.. అతను మిస్సింగ్
దిశ, స్పోర్ట్స్ : ఇంగ్లాండ్‌తో ఐదు టెస్టుల సిరీస్‌లో 2-1తో టీమ్ ఇండియా ఆధిక్యంలో ఉన్నది. రాజ్‌కోట్ విజయంతో సిరీస్‌పై పట్టు సాధించింది. ఈ నెల 23 నుంచి 27 వరకు నాలుగో టెస్టుకు రాంచీ ఆతిథ్యమిస్తున్నది. ఈ మ్యాచ్ కోసం భారత్, ఇంగ్లాండ్ జట్లు మంగళవారం రాంచీకి చేరుకున్నాయి. బీసీసీఐ ఏర్పాటు చేసిన స్పెషల్ చార్టెడ్ ఫ్లైట్స్‌లో ఇరు జట్ల ఆటగాళ్లు రాంచీకి చేరుకున్నారు.
నాలుగో టెస్టుకు స్టార్ పేసర్ బుమ్రాకు విశ్రాంతినిచ్చినట్టు తెలిసింది. రాంచీ ఎయిర్‌పోర్టులో భారత జట్టుతో బుమ్రా కనిపించలేదు. భారత పేసర్లలో సిరాజ్, ఆకాశ్ దీప్ మాత్రమే రాంచీకి చేరుకున్నారు. వర్క్ మేనేజ్‌మెంట్‌లో భాగంగా బుమ్రాకు రెస్ట్ ఇచ్చినట్టు తెలుస్తోంది. ప్రస్తుతం సిరీస్‌లో బుమ్రా 17 వికెట్లతో లీడింగ్ వికెట్ టేకర్‌గా ఉన్నాడు. అతని స్థానంలో ముకేశ్ కుమార్‌ను తీసుకునే అవకాశం ఉంది. మరోవైపు, మరో పేసర్ ఆకాశ్ దీప్ అరంగేట్రాన్ని కూడా కొట్టిపారేయలేం. అయితే, దీనిపై బీసీసీఐ నుంచి స్పష్టత రావాల్సి ఉంది.
మరోవైపు, ప్రస్తుతం సిరీస్‌లో 2-1తో ఆధిక్యంలో ఉన్న భారత్ మరో మ్యాచ్ నెగ్గితే సిరీస్ దక్కినట్టే. కాబట్టి, రాంచీలోనే సిరీస్ కైవసం చేసుకోవడంపై రోహిత్ సేన ఫోకస్ పెట్టింది. వరుసగా రెండు ఓటములతో వెనుకబడిన ఇంగ్లాండ్ పుంజుకోవడంపై దృష్టి పెట్టింది. రాంచీ టెస్టును నెగ్గి సిరీస్‌ను 2-2తో సమం చేయాలనే లక్ష్యంతో బరిలోకి దిగనుంది.