- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
భారత స్టార్ బౌలర్‌కి ఐపీఎల్‌లో భారీ షాక్
దిశ, వెబ్ డెస్క్: గాయం కారణంగా టీ20 ప్రపంచకప్ కు దూరమైన భారట్ స్టార్ బౌలర్ మహ్మద్ షమీ(Mohammed Shami)కి ఐపీఎల్ (IPL)లో భారీ షాక్ తగలనున్నట్లు తెలుస్తోంది. ఐపీఎల్ 2025-2027 రెండు సంవత్సరాలకు సంబంధించిన మెగా వేలం డిసెంబర్ లో జరగనుంది. కాగా ఈ వేలం కి ముందు ఐపీఎల్ జట్లకు కొత్త రూల్స్ ఇచ్చారు. ఇందులో భాగంగా ప్రతి జట్టు ఐదుగురు ప్లేయర్లను రిటెన్షన్ చేరుకునే అవకాశం కల్పించింది. ఈ క్రమంలో రిటెన్షన్ నిర్ణయాలపై ఆయా జట్లు కసరత్తు ప్రారంభించాయి. ఈ క్రమంలో గుజరాత్ టైటాన్స్ జట్టు భారత స్టార్ బౌలర్ మహ్మద్ షమీని వదిలేసేందుకు నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది. కాగా షమీ గాయం కారణంగా ఇప్పటికే టీ20 వరల్డ్ కప్ సహా అన్ని కీలక మ్యాచులకు సంవత్సరం నుండి దూరంగా ఉన్నారు. ఈ కారణంతోనే షమీని గుజరాత్ వదులుకునేందుకు సిద్దం అయిందని వార్తలు వస్తున్నాయి. ఇదే గనుక నిజమైన షమీ మెగా వేలంలో పాల్గొంటారు. ఇదిలా ఉంటే గుజరాత్ జట్టు కెప్టెన్ శుభ్‌మన్ గిల్, రషద్ ఖాన్, సాయి సుదర్శన్, రాహుత్ తెవాటియా, షారుఖ్ ఖాన్‌లను రిటెన్షన్ చేసుకుంటుందని వార్తలు వస్తున్నాయి. కాగా దీనిపై ఆ జట్టు అధికారిక ప్రకటన చేయాల్సి ఉంది.