- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
IPL-2025: కొత్త జెర్సీలో KKR ఆటగాళ్లు.. సోషల్ మీడియాలో వీడియో వైరల్

దిశ, వెబ్‌డెస్క్: కోట్లాది మంది క్రికెట్ అభిమానులను ఉర్రూలూగించేందుకు అతిపెద్ద టీ20 క్రికెట్ పండుగ ఐపీఎల్-2025 (IPL-2025) వచ్చేస్తోంది. ఇప్పటికే నిర్వాహకులు షెడ్యూల్‌ను కూడా విడుదల చేశారు. మార్చి 22 నుంచి మే 25 వరకు ఐపీఎల్ (IPL) కొనసాగనుంది. ప్రధాన నగరాల్లోకి మొత్తం 13 స్టేడియాల్లో మొత్తం 74 మ్యాచ్‌లు జరుగుతాయి. తొలి మ్యాచ్‌లో డిఫెండింగ్ ఛాంపియన్ కోల్‌కతా నైట్ రైడర్స్ (Kolkata Knight Riders)తో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (Royal Challengers Bangalore) తలపడనుంది. మొదటి మ్యాచ్‌తో సహా ఫైనల్ కూడా ఈడెన్ గార్డెన్స్ (Eden Gardens)లోనే జరగనుంది. ఈ క్రమంలోనే ఐపీఎల్-2025 సీజన్‌కు ముందు కేకేఆర్ జట్టు (KKR Team) తమ కొత్త జెర్సీని ఆవిష్కరించింది. ఈ మేరకు జెర్సీ లాంచ్ వీడియోను సోషల్ మీడియా (Social Media)లో పోస్టు చేసింది. అయితే, ఆ జెర్సీ లాంచ్ (Jersey launch) వీడియోలో కోల్‌కతా నైట్ రైడర్స్ ప్లేయర్లు రహానే (Rahane), వెంకటేష్ అయ్యర్ (Venkatesh Iyer), రింకూసింగ్ (Rinku Singh) కొత్త జెర్సీని ధరించి కనిపించారు. ప్రస్తుతం అందుకు సంబంధించి వీడియో సోషల్ మీడియా (Social Media)లో తెగ వైరల్ అవుతోంది.
కేకేఆర్ జట్టు ఇదే..
వెంకటేష్ అయ్యర్, క్వింటన్ డికాక్, రింకూ సింగ్, వరుణ్ చక్రవర్తి, సునీల్ నరైన్, ఆండ్రీ రస్సెల్, హర్షిత్ రాణా, రహమానుల్లా గుర్బాజ్ , అన్రిచ్ నార్ట్జే, అంగ్క్రిష్ రఘువంశీ, వైభవ్ అరోరా, రోవ్‌మన్ పావెల్, మనీష్ పాండే, స్పెన్సర్ జాన్సన్, లువ్నిత్ సిసోడియా, అజింక్యా రహానె , అనుకుల్ రాయ్, మాలీక్.