- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
స్లో ఓవర్ రేట్.. పాండ్యాకు, ముంబై జట్టుకు భారీ జరిమానా
దిశ, స్పోర్ట్స్: ముంబై ఇండియన్స్ ఈ ఏడాది ఐపీఎల్ లో పేలవ ప్రదర్శన చేసింది. ప్లే ఆఫ్స్ ఆశలు గల్లంతయ్యాయి. ఇదిలా ఉంటే.. అదే జట్టుకి మరో ఊహించని షాక్ తగిలింది. అలాగే.. కెప్టెన్ పాండ్యాకు సైతం భారీ దెబ్బ పడింది. లక్నో సూపర్ జెయింట్స్‌తో జరిగిన మ్యాచ్‌లో నాలుగు వికెట్ల తేడాతో ఓడిపోయింది. అయితే, ఈ మ్యాచ్ లో ముంబై స్లో ఓవర్ రేట్ ని మెయింటెయిన్ చేసింది. ఈ మ్యాచ్‌లో ముంబై బౌలర్లు నిర్ణీత సమయంలో ఓవర్లు పూర్తి చేయలేదు. దీంతో.. ముంబై కెప్టెన్ హార్దిక్ పాండ్యాకు రూ.24 లక్షల జరిమానా పడింది. ఇంపాక్ట్ ప్లేయర్‌తో కలిపి మిగతా ఆటగాళ్లకు రూ. 6 లక్షలు లేదా వారి మ్యాచ్ ఫీజులో 25 శాతం చొప్పున కోత విధించింది. కెప్టెన్ పాండ్యాతో పాటు ముంబై జట్టుకి ఫైన్ విధించామని ఐపీఎల్ యాజమాన్యం ప్రకటనలో తెలిపింది. ఈ సీజన్ లో ముంబై జట్టు ఇలా స్లో ఓవర్ రేట్ తో బౌలింగ్ చేయడం ఇది రెండోసారి. దీంతో.. భారీగా జరిమానా విధించినట్లు తెలిపింది.