INDW vs WIW: రెండో వన్డేలో టాస్ గెలిచిన భారత్.. జట్టు ఇదే

by Mahesh |   ( Updated:2024-12-24 11:43:01.0  )
INDW vs WIW: రెండో వన్డేలో టాస్ గెలిచిన భారత్.. జట్టు ఇదే
X

దిశ, వెబ్ డెస్క్: భారత్, వెస్టిండీస్ జట్ల మధ్య మూడు వన్డేల సిరీస్ జరుగుతుంది. ఇందులో భాగంగా నేడు రెండో వన్డే మ్యాచ్ వడోదర వేదికగా ప్రారంభం కాగా.. ఇందులో టాస్ గెలిచిన భారత్ మొదట బ్యాటింగ్ ఎంచుకుంది. కాగా మొదటి వన్డేలో భారీ విజయం సాధించిన భారత మహిళల జట్టు ఈ మ్యాచులో ఎలాగైనా విజయం సాధించి సిరీస్ ను కైవసం చేసుకునే ప్లాన్ వేసింది. అలాగే ఐసీసీ ఛాంపియన్షిప్ పాయింట్ల పట్టికలో కూడా ర్యాంక్ పై కన్నేసింది. మరోపక్క మొదటి వన్డేలో ఘోర ఓటమికి పగ తీర్చుకునేందుకు వెస్టిండీస్ జట్టు సిద్దంగా ఉంది. దీంతో ఈ రోజు జరిగే ఈ మ్యాచ్ ఉత్కంఠగా కొనసాగే అవకాశం కనిపిస్తుంది. మరి ఈ మ్యాచ్ లో ఎవరు గెలుస్తారో తెలియాలంటే మ్యాచ్ పూర్తయ్యే వరకు వేచి చూడాల్సిందే మరి.

భారత్ ప్లేయింగ్ XI: స్మృతి మంధాన, ప్రతీకా రావల్, హర్లీన్ డియోల్, హర్మన్‌ప్రీత్ కౌర్(సి), జెమీమా రోడ్రిగ్స్, రిచా ఘోష్(w), దీప్తి శర్మ, సైమా ఠాకోర్, టిటాస్ సాధు, రేణుకా ఠాకూర్ సింగ్, ప్రియా మిశ్రా

వెస్టిండీస్ ప్లేయింగ్ XI: హేలీ మాథ్యూస్ (సి), కియానా జోసెఫ్, రషదా విలియమ్స్, డియాండ్రా డాటిన్, నెరిస్సా క్రాఫ్టన్, షెమైన్ కాంప్‌బెల్ (w), ఆలియా అలీన్, జైదా జేమ్స్, కరిష్మా రామ్‌హారక్, షామిలియా కానెల్, అఫీ ఫ్లెచర్

Advertisement

Next Story

Most Viewed