వరల్డ్ ర్యాపిడ్ చెస్ చాంపియన్‌షిప్.. టైటిల్ రేసులో విదిత్

by Vinod kumar |   ( Updated:2023-12-28 14:27:48.0  )
వరల్డ్ ర్యాపిడ్ చెస్ చాంపియన్‌షిప్.. టైటిల్ రేసులో విదిత్
X

న్యూఢిల్లీ : వరల్డ్ ర్యాపిడ్ చెస్ చాంపియన్‌షిప్ టైటిల్ రేసులో భారత యువ గ్రాండ్‌మాస్టర్ విదిత్ సంతోశ్ గుజరాతి ముందు వరుసలో ఉన్నాడు. గురువారం 11వ రౌండ్ ముగిసే సరికి అతను 8.5 పాయింట్లతో రెండో స్థానంలో నిలిచాడు. 11వ రౌండ్‌లో విదిత్.. సహచరుడు, తెలుగు కుర్రాడు అర్జున్ ఇరిగైసిపై విజయం సాధించాడు. 31 ఎత్తుల్లో విదిత్ గెలుపొందాడు. ప్రస్తుతం వరల్డ్ చాంపియన్, నార్వే గ్రాండ్‌మాస్టర్ మాగ్నస్ కార్ల్‌సన్ 9.0 పాయింట్లతో అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. కార్ల్‌సన్‌ కంటే విదిత్ కేవలం 0.5 పాయింట్ వెనకబడి ఉన్నాడు. ఈ టోర్నీలో మొత్తం 13 రౌండ్లు ఉండగా.. మిగతా రెండు రౌండ్లలో విదిత్ ప్రదర్శనపై టైటిల్ ఆధారపడి ఉంది. మహిళల విభాగంలో మాజీ చాంపియన్ కోనేరు హంపి 7.5 పాయింట్లతో మూడో స్థానంలో ఉన్నది. 10వ రౌండ్‌లో ఆమె.. రష్యా క్రీడాకారిణి లియా గారిఫుల్లినాతో డ్రా చేసుకుంది.

Read More..

స్టార్ స్పోర్ట్స్ టీ20 జట్టులో ఐదుగురు భారత క్రికెటర్లు..

Advertisement

Next Story

Most Viewed