Tanveer Sangha: ఆస్ట్రేలియా ప్రపంచకప్ జట్టలో భారత సంతతికి చెందిన టాక్సీ డ్రైవర్ కుమారుడు.. నాల్గో భారత సంతతి ప్లేయర్‌గా.. (వీడియో)

by Vinod kumar |   ( Updated:2023-09-09 14:03:39.0  )
Tanveer Sangha: ఆస్ట్రేలియా ప్రపంచకప్ జట్టలో భారత సంతతికి చెందిన టాక్సీ డ్రైవర్ కుమారుడు.. నాల్గో భారత సంతతి ప్లేయర్‌గా.. (వీడియో)
X

దిశ, వెబ్‌డెస్క్: భారత సంతతికి చెందిన అన్‌క్యాప్‌డ్ లెగ్ స్పిన్నర్ తన్వీర్ సంఘా భారత్‌లో జరగనున్న వన్డే ప్రపంచకప్ కోసం 18 మంది సభ్యులతో కూడిన ఆస్ట్రేలియా జట్టులో చోటు దక్కించుకున్నాడు. తర్వాత జట్టును 15 మందికి కుదించనున్నట్లు క్రికెట్ ఆస్ట్రేలియా సోమవారం ఒక ప్రకటనలో తెలిపింది. సిడ్నీలో పుట్టి పెరిగిన, మిస్టరీ రిస్ట్ స్పిన్నర్ సంఘా 1990లలో పంజాబ్‌లోని జలంధర్ నుంచి ఆస్ట్రేలియాకు వలస వెళ్లిన భారతీయ కుటుంబానికి చెందినవారు. అతని తండ్రి జోగా టాక్సీ డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. అతని తల్లి అప్నీత్ అకౌంటెంట్‌గా పని చేస్తున్నారు. గురిందర్ సంధు, స్టువర్ట్ క్లార్క్, బ్రాన్స్‌బీ కూపర్ తర్వాత ఆస్ట్రేలియాకు ఎంపికైన నాల్గో భారత సంతతి ఆటగాడు సంఘా నిలిచాడు.

21 ఏళ్ల సంఘ సిడ్నీ థండర్ కోసం T20 క్రికెట్‌లో ఆడారు. ఐదు లిస్ట్ A మ్యాచ్‌లు కూడా ఆడాడు. 2020-2021 బిగ్ బాష్ లీగ్‌లో సంఘ 21 వికెట్లు పడగొట్టాడు. తర్వాతి సీజన్‌లో 16 వికెట్లు తీశాడు. 2020 అండర్-19 ప్రపంచ కప్‌లో అత్యధిక వికెట్లు తీసిన వారిలో సంఘా ఒకడు. ఆరు మ్యాచ్‌ల్లో రెండుసార్లు 4 వికెట్లు, ఒకసారి 5 వికెట్లు తీశాడు. ICC నిబంధనల ప్రకారం ఆస్ట్రేలియా సెప్టెంబర్ 28లోపు జట్టులను ఖరారు చేయాలి. ఈ ఏడాది ప్రపంచకప్‌లో ఆతిథ్య భారత్‌తో చెన్నైలో అక్టోబర్ 8న జరగనుంది.

Advertisement

Next Story

Most Viewed