World Championship: తొలిసారి ఫైనల్‌కు దూసుకెళ్లిన భారత జట్టు..

by Vinod kumar |   ( Updated:2023-08-29 12:10:30.0  )
World Championship: తొలిసారి ఫైనల్‌కు దూసుకెళ్లిన భారత జట్టు..
X

దిశ, వెబ్‌డెస్క్: వరల్డ్ ఛాంపియన్‌షిప్స్‌లో 4×400 మీటర్ల రిలేలో భారత జట్టు అదరగొట్టింది. అత్యంత వేగంగా ఈ రేస్‌ను ముగించిన ఆసియా దేశంగా రికార్డు నెలకొల్పింది. శనివారం జరిగిన హీట్స్-1లో భారత పురుషులు చెలరేగారు. మహమ్మద్ అనాజ్, అమోజ్ జాకబ్, మహమ్మద్ అజ్మల్, రాజేష్ రమేష్ నలుగురూ ఉన్న బృందం అద్భుతంగా రాణించింది. ఈ టీం కేవలం 2.59.05 సెకన్లలోనే రేస్‌ను ముగించింది. ఈ క్రమంలో రెండో స్థానంలో నిలిచి ఫైనల్‌కు దూసుకెళ్లింది.

వరల్డ్ ఛాంపియన్‌షిప్ చరిత్రలో భారత రిలే బృందం ఫైనల్ చేరడం ఇదే తొలిసారి కావడం గమనార్హం. అంతేకాదు, 4×400 మీటర్ల రిలేను అత్యంత వేగంగా ముగించిన ఆసియా జట్టుగా నిలిచింది. ఇంతకుముందు ఈ రికార్డు జపాన్ బృందం పేరిట ఉండేది. జపాన్ టీం 2.59.51 సెకన్లలో ఈ రేస్ ముగించింది. ఇప్పుడు భారత బృందం ఈ రికార్డు బద్దలు కొట్టింది. ఇక ఈ రేస్‌లో అమెరికా బృందం టాప్‌లో నిలిచింది. భారత్ రెండో స్థానం సాధించింది. మూడో స్థానంలో బ్రిటన్ బృందం నిలిచింది. అమెరికా ఈ రేస్‌ను 2.58.47 సెకన్లలో పూర్తి చేయడం గమనార్హం.

Advertisement

Next Story

Most Viewed