- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
సీనియర్ల బాటలోనే కుర్రాళ్లు.. అండర్-19 వరల్డ్ కప్ ఫైనల్‌లో యువ భారత్ ఓటమి
దిశ, స్పోర్ట్స్ : ఐసీసీ వన్డే వరల్డ్ కప్ ఫైనల్‌లో ఆస్ట్రేలియా చేతిలో టీమ్ ఇండియా ఓటమి.. ఆ క్షణాలను భారత అభిమానులు ఇంకా జీర్ణించుకోలేదు. అంతలోనే మరో నిరాశ. అదే ప్రత్యర్థి చేతిలో మరోసారి భంగపాటు. సీనియర్ల బాటలోనే కుర్రాళ్లు అభిమానుల ఆశలను ఆవిరి చేశారు. అక్కడ జైత్రయాత్ర కొనసాగించిన రోహిత్ సేన ఫైనల్‌లో ఓటమిని అంగీకరించగా.. ఇక్కడ ఉదయ్ టీమ్‌ది అదే పరిస్థితి. టైటిల్ పోరుకు ముందు ఓటమెరుగని యువ భారత్ ఆసిస్ ముందు తేలిపోయింది. ఫలితంగా ఆస్ట్రేలియా నాలుగోసారి టైటిల్‌ను దక్కించుకుంది.
ఐసీసీ అండర్-19 పురుషుల వరల్డ్ కప్‌లో యువ భారత్ తుది మెట్టుపై బోల్తా పడింది. వరుస విజయాలతో టైటిల్ నిలబెట్టుకునేలా కనిపించిన టీమ్ ఇండియా ఫైనల్‌లో ఆస్ట్రేలియా చేతిలో పరాజయం పాలైంది. సౌతాఫ్రికాలోని బెనోని వేదికగా ఆదివారం జరిగిన టైటిల్ పోరులో 79 పరుగుల తేడాతో భారత్‌ను ఆసిస్ ఓడించింది. టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన ఆస్ట్రేలియా నిర్ణీత ఓవర్లలో 7 వికెట్లను కోల్పోయి 253 పరుగులు చేసింది. హర్జాస్ సింగ్(55) హాఫ్ సెంచరీతో జట్టును ఆదుకోగా.. కెప్టెన్ హ్యూ వీబ్డెన్(48), ఒలివర్ పీక్(46), హ్యారీ డిక్సన్(42) కీలక పరుగులు జోడించారు. అనంతరం మోస్తరు లక్ష్యాన్ని ఛేదించడంలో భారత జట్టు విఫలమైంది. 43.5 ఓవర్లలోనే 174 పరుగులకే ఆలౌటైంది. ఒత్తిడిని జయించలేకనో, ఆసిస్ బౌలర్లను ధాటికి నిలువలేకనో వరుసగా వికెట్లు పారేసుకున్నారు. ఆరంభం నుంచే ఈ తడబాటు మొదలైంది. ఓపెనర్ అర్షిన్ కులకర్ణి(3) వికెట్‌తో భారత్ పతనం ప్రారంభమైంది. ఆ తర్వాత ఆసిస్ బౌలర్లు వరుస వికెట్లతో చెలరేగారు. ఫామ్‌లో ఉన్న ముషీర్(22) స్వల్ప స్కోరుకే వెనుదిరగగా.. ఆదుకుంటారనుకున్న కెప్టెన్ ఉదయ్ సహారన్(8), సచిన్ దాస్(9) సైతం నిరాశపరిచారు. దీంతో 68 పరుగులకే 4 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ఆ తర్వాత ప్రియాన్ష్(0), తెలుగు కుర్రాడు అవనీశ్(0) సైతం విఫలమవడంతో 100 పరుగుల్లోపే 6 వికెట్లు నష్టపోయి ఓటమి అంచున నిలిచింది. పోరాటం చేసిన ఓపెనర్ ఆదర్శ(47) స్కోరు 100 దాటిన తర్వాత వికెట్ పారేసుకున్నాడు. కాసేపటికే 8వ వికెట్‌గా రాజ్ లింబాని(0) డకౌట్‌గా వెనుదిరిగాడు. అనంతరం మురుగన్ అభిషేక్(42) పోరాటం జట్టు కష్టంగా 150 పరుగుల మార్క్‌ను దాటింది. ఇక, 41వ ఓవర్‌లో అతని పోరాటానికి కల్లమ్ విడ్లర్ బ్రేక్ వేయగా.. కాసేపటికే ఆఖరి వికెట్‌గా సౌమీ పాండే(2) అవుటవడంతో భారత్ ఆట ముగిసింది. ఆసిస్ బౌలర్లలో బార్డ్‌మాన్(3/15), మాక్‌మిల్లన్(3/43) టీమ్ ఇండియా పతనాన్ని శాసించగా.. కల్లమ్ విడ్లర్ 2 వికెట్లు పడగొట్టాడు. అండర్సన్, టామ్ స్ట్రాకర్‌కు చెరో వికెట్ దక్కింది. కీలక వికెట్లు తీసిన ఆసిస్ విజయంలో ముఖ్య పాత్ర పోషించిన బార్డ్‌మాన్ ప్లేయర్ ఆఫ్ ది అవార్డు అందుకున్నాడు.
ఆదుకున్న హర్జాస్ సింగ్
టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన ఆస్ట్రేలియాకు శుభారంభం దక్కలేదు. రాజ్ లింబాని వేసిన 3వ ఓవర్‌లోనే ఓపెనర్ సామ్ కాన్స్టాస్(0)ను డకౌట్‌గా వెనుదిరిగాడు. అనంతరం క్రీజులోకి వచ్చిన కెప్టెన్ హ్యూ వీబ్డెన్(48), మరో ఓపెనర్ హ్యారీ డిక్సాన్(42) కలిసి ఇన్నింగ్స్ నిర్మించారు. భారత బౌలర్లను సమర్థవంతంగా ఎదుర్కొన్న వీరు హాఫ్ సెంచరీలకు చేరువయ్యారు. ఈ క్రమంలో ఆసిస్‌కు నమన్ తివారి వరుస షాక్‌లు ఇచ్చాడు. మొదట హ్యూ వీబ్డెన్‌ను అవుట్ చేసి ఈ జోడీని విడదీశాడు. వరుస ఓవర్‌లో హ్యారీ డిక్సన్‌ను కూడా పెవిలియన్ పంపాడు. అనంతరం హర్జాస్ సింగ్(55) కీలక ఇన్నింగ్స్ ఆడాడు. ర్యాన్ హిక్స్(20)తో 66 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పాడు. హాఫ్ సెంచరీ పూర్తి చేసిన కాసేపటికే హర్సాస్ సింగ్‌ను సౌమీ పాండే వికెట్ల ముందు దొరకబుచ్చుకున్నాడు. దీంతో 181 పరుగుల వద్ద ఆసిస్ 5 వికెట్ కోల్పోవడంతో ఆ జట్టు 220 పరుగుల లోపే పరిమితయ్యేలా కనిపించింది. కానీ, ఆఖర్లో ఓలివర్ పీక్(46 నాటౌట్) పోరాటంతో ఆసిస్ 250 పరుగుల మార్క్‌ను దాటింది. భారత బౌలర్లలో రాజ్ లింబాని 3 వికెట్లు, నమన్ తివారి 2 వికెట్లతో సత్తాచాటగా.. సౌమీ పాండే, ముషీర్ ఖాన్‌లకు చెరో వికెట్ దక్కింది.
స్కోరుబోర్డు
ఆస్ట్రేలియా అండర్-19 ఇన్నింగ్స్ : 253/7(50 ఓవర్లు)
హ్యారీ డిక్సన్(సి)అభిషేక్(బి)నమన్ తివారి 42, సామ్ కన్స్టాస్(బి)రాజ్ లింబాని 0, హ్యూ వీబ్డెన్(సి)ముషీర్ ఖాన్(బి)నమన్ తివారి 48, హర్జాస్ సింగ్ ఎల్బీడబ్ల్యూ(బి)సౌమీ పాండే 55, ర్యాన్ హిక్స్ ఎల్బీడబ్ల్యూ(బి)రాజ్ లింబాని 20, ఒలివర్ పీక్ 46 నాటౌట్, రాఫ్ మాక్‌మిల్లన్(సి అండ్ బి)ముషీర్ ఖాన్ 2, అండర్సన్ ఎల్బీడబ్ల్యూ(బి)రాజ్ లింబాని 13, టామ్ స్ట్రాకెర్ 8 నాటౌట్; ఎక్స్‌ట్రాలు 19.
వికెట్ల పతనం : 16-1, 94-2, 99-3, 165-4, 181-5, 187-6, 221-7
బౌలింగ్ : రాజ్ లింబాని(10-0-38-3), నమన్ తివారి(9-0-63-2), సౌమీ పాండే(10-0-41-1), ముషీర్ ఖాన్(9-0-46-1), మురుగన్ అభిషేక్(10-0-37-0), ప్రియాన్ష్(2-0-17-0)
భారత్ అండర్-19 ఇన్నింగ్స్ : 174 ఆలౌట్(43.5 ఓవర్లు)
ఆదర్శ్(సి)ర్యాన్ హిక్స్(బి)బార్డ్‌మాన్ 47, అర్షిన్(సి)ర్యాన్ హిక్స్(బి)కల్లమ్ విడ్లర్ 3, ముషీర్(సి)బార్డ్‌మాన్ 22, ఉదయ్(సి)హ్యూ వీబ్డెన్(బి)బార్డ్‌మాన్ 8, సచిన్ దాస్(సి)ర్యాన్ హిక్స్(బి)మాక్‌మిల్లన్ 9, ప్రియాన్ష్(సి)కల్లమ్ విడ్లర్(బి)అండర్సన్ 9, అవనీశ్(సి అండ్ బి)మాక్‌మిల్లన్ 0, అభిషేక్(సి)హ్యూ వీబ్డెన్(బి)కల్లమ్ విడ్లర్ 42, రాజ్ లింబాని(బి)మాక్‌మిల్లన్ 0, నమన్ తివారి 14 నాటౌట్, సౌమీ పాండే(సి)ర్యాన్ హిక్స్(బి)టామ్ స్ట్రాకర్ 2; ఎక్స్‌ట్రాలు 18.
వికెట్ల పతనం : 3-1, 40-2, 55-3, 68-4, 90-5, 91-6, 115-7, 122-8, 168-9, 174-10
బౌలింగ్ : కల్లమ్ విడ్లర్(10-2-35-2), అండర్సన్(9-0-42-1), టామ్ స్ట్రాకర్(7.5-1-32-1), బార్డ్‌మాన్(7-2-15-3), మాక్‌మిల్లన్(10-0-43-3)