మూడో టెస్ట్ మ్యాచ్ వేదిక మారింది.. ట్వీట్ చేసిన బీసీసీఐ

by Vinod kumar |   ( Updated:2023-02-13 14:13:29.0  )
మూడో టెస్ట్ మ్యాచ్ వేదిక మారింది.. ట్వీట్ చేసిన బీసీసీఐ
X

దిశ, వెబ్‌డెస్క్: బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా ఇండియా, ఆస్ట్రేలియా జట్ల మధ్య నాలుగు టెస్ట్ మ్యాచ్‌ల సిరీస్‌ జరుగుతుంది. మార్చి 1న ప్రారంభం కావాల్సి మూడో టెస్ట్ మ్యాచ్ వేదికను బీసీసీఐ మార్పు చేసింది. మూడో టెస్ట్ మ్యాచ్ తొలుత ధర్మశాలలో నిర్వహించేందుకు నిర్ణయించింది. కానీ ధర్మశాలలో ఔట్ ఫీల్డ్ సిద్ధంగా లేకపోవడంతో.. మూడో మ్యాచ్ వేదికను మార్చుతూ బీసీసీఐ తాజాగా ట్వీట్ చేసింది.

బీసీసీఐ క్యురేటర్ తపోష్ ఛటర్జీ హిమాచల్ ప్రదేశ్ క్రికెట్ సంఘం (హెచ్‌పీసీఏ) స్టేడియం పిచ్, ఔట్ ఫీల్డ్‌ను తనిఖీ చేసి, బోర్డుకు నివేదిక అందించాడు. దీంతో మూడో టెస్టు మ్యాచ్‌ను ఇండోర్‌లోని హోల్కర్ స్టేడియంకు మార్పు చేస్తూ.. బీసీసీఐ సోమవారం ఉదయం ట్వీట్ చేసింది.

Advertisement

Next Story