చరిత్రలో తొలిసారి సూపర్ ఓవర్ ఆడిన భారత్..

by Mahesh |   ( Updated:2022-12-12 07:40:12.0  )
చరిత్రలో తొలిసారి సూపర్ ఓవర్ ఆడిన భారత్..
X

దిశ, వెబ్‌డెస్క్: భారత మహిళల జట్టు ఆస్ట్రేలియా జట్టుకు షాక్ ఇచ్చింది. ఆదివారం ముంబైలో జరిగిన రెండో టీ20 ఇరు జట్ల స్కోరు సమం అయింది. దీంతో భారత మహిళల జట్టు చరిత్రలో మొదటిసారి సూపర్ ఓవర్ ఆడారు. కాగా ఈ సూపర్ ఓవర్ లో భారత్ ఒక వికెట్ కోల్పోయి 19 పరుగులు చేసింది అనంతరం 20 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్ కు దిగిన ఆస్ట్రేలియా జట్టు ఆరు బంతులకు ఒక వికెట్ కోల్పోయి 16 పరుగులు చేసి ఓటమి చెందింది. కాగా అంతకు ముందు మొదట బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా మహిళలు కేవలం ఒక వికెట్ కోల్పోయి.. 187 పరుగుల భారీ స్కోరు చేసింది. కాగా అనంతరం 188 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్ కు దిగిన భారత మహిళలు 20 ఓవర్లకు 5 వికెట్లు కోల్పోయి.. 187 పరుగులు చేయడంతో మ్యాచ్ టై అయింది. దీంతో ఎంపైర్స్ సూపర్ ఓవర్ పెట్టారు.

Also Read...

ముగిసిన వన్ టీం వన్ డ్రీమ్ 4వ సీనియర్ హాకీ కార్నివాల్

Advertisement

Next Story