IND vs PAK: రేపే భారత్-పాకిస్థాన్ మ్యాచ్.. ఆ స్టార్ క్రికెటర్ దూరం

by D.Reddy |
IND vs PAK: రేపే భారత్-పాకిస్థాన్ మ్యాచ్.. ఆ స్టార్ క్రికెటర్ దూరం
X

దిశ, వెబ్ డెస్క్: ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ-2025లో భాగంగా ఆదివారం (ఫిబ్రవరి 23) భారత్, పాకిస్థాన్ మ్యాచ్ జరుగనుంది. ఈ మ్యాచ్ కోసం క్రికెట్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తోన్నారు. ఈ క్రమంలో భారత క్రికెట్ అభిమానులకు ఓ బ్యాడ్ న్యూస్. టీమిండియా స్టార్ క్రికెటర్ రిషబ్ పంత్ అనారోగ్య బారిన పడ్డాడు. దీంతో రేపు జరుగబోయే మ్యాచ్‌కు దూరమయ్యాడు. ఈ విషయాన్ని టీమిండియా వైస్ కెప్టెన్ శుభ్‌మన్ గిల్ వెల్లడించాడు.

పాకిస్థాన్‌తో జరుగబోయే మ్యాచ్ కోసం ఇరు జట్లు తీవ్రంగా ప్రాక్టీస్‌లో బిజీగా ఉన్నాయి. అయితే, ఈ ప్రాక్టీస్ సెషన్‌లో రిషబ్ పంత్ పాల్గొనలేదు. దీనిపై గిల్ స్పందించాడు. పంత్‌ తీవ్ర వైరల్ ఫీవర్ బారిన పడినట్లు తెలిపాడు. బీసీసీఐ వైద్య బృందం ఎప్పటికప్పుడు అతనికి చికిత్స, అవసరమైన మందులు ఇస్తున్నారని చెప్పాడు. అందుకే ప్రాక్టీస్‌లో పాల్గొనలేదని తెలిపాడు.

అయితే, భారత జట్టులో వికెట్ కీపర్/బ్యాటర్‌గా కేఎల్ రాహుల్ మొదటి ఎంపికగా కొనసాగుతున్నాడు. ఈ నేపథ్యంలో పాకిస్థాన్‌తో మ్యాచ్‌కు పంత్ అందుబాటులో లేకపోయినా, అది భారత్‌పై పెద్దగా ప్రభావం చూపబోదని క్రికెట్ విశ్లేషకులు చెబుతున్నారు. బంగ్లాదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో రాహుల్ 47 బంతుల్లో అజేయంగా 41 పరుగులు చేశాడు. గిల్‌తో కలిసి ఐదవ వికెట్‌కు 87 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పాడు.

భారత జట్టు: రోహిత్ శర్మ(C), శుభ్‌మన్ గిల్, విరాట్ కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్, కేఎల్ రాహుల్ (WK), హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, మహ్మద్ షమీ, హర్షిత్ రాణా.

Next Story