- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ప్రపంచ టెస్టు ఛాంపియన్ షిప్ ఫైనల్స్‌లో టీమిండియా..!
దిశ, వెబ్‌డెస్క్: ప్రపంచ టెస్టు ఛాంపియన్ షిప్ ఫైనల్‌కు టీమిండియా దాదాపుగా చేరుకుంది. బోర్డర్ గవాస్కర్ సిరీస్‌లో భాగంగా ఢిల్లీ వేదికగా జరిగిన రెండో టెస్ట్ మ్యాచ్‌లో భారత్ ఆరు వికెట్ల తేడాతో ఆస్ట్రేలియాను ఓడించింది. దీంతో నాలుగు టెస్టుల సిరీస్‌లో టీమ్‌ఇండియా 2-0తో ఆధిక్యంలోకి వెళ్లింది. వరుసగా రెండో టెస్టులోనూ నాగ్‌పూర్ టెస్టులో, ఢిల్లీ రెండో టెస్ట్ మ్యాచ్‌లో భారత్ విజయం సాధించడంతో భారత్ ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌లో ఫైనల్‌కు దాదాపు దూసుకెళ్లినట్లే.
ప్రస్తుత డబ్ల్యూటీసీ పాయింట్ల పట్టికను పరిశీలిస్తే భారత్ తన నంబర్ టూ స్థానాన్ని మరింత పటిష్టం చేసుకుంది. పాయింట్ల పట్టికలో మొదటి రెండు స్థానాల్లో నిలిచిన జట్లు ఫైనల్స్‌కు అర్హత సాధిస్తాయి. ఆస్ట్రేలియా ఇప్పటికే ఫైనల్స్‌కు చేరుకుంది. ఐసీసీ వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ పాయింట్ల పట్టికను పరిశీలిస్తే భారత్ 64.06 పాయింట్లతో రెండో స్థానంలో ఉండగా.. 66.67 పాయింట్లతో ఆస్ట్రేలియా జట్టు నంబర్‌వన్‌గా కొనసాగుతోంది. ఈ జట్లతో పాటు శ్రీలంక 53.33 పాయింట్లతో మూడో స్థానంలో, దక్షిణాఫ్రికా 48.72 పాయింట్లతో నాలుగో స్థానంలో ఉన్నాయి. ఐసీసీ వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్ మ్యాచ్ ఈ ఏడాది జూన్ 7వ తేదీ నుంచి లండన్‌లోని ఓవల్ మైదానంలో జరగనుంది. ఈ పోటీల్లో ఆస్ట్రేలియా జట్టు ఇప్పటికే ఫైనల్‌కు చేరుకుంది. అయితే టైటిల్ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా ఎదుర్కొనే మరో జట్టు ఎవరన్నది ఇంకా అధికారికంగా ఖరారు కాలేదు.
ప్రస్తుతం భారత జట్టు పాయింట్ల పట్టికలో రెండో స్థానంలో ఉంది. ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్‌లో ఫైనల్‌కు చేరాలంటే.. ప్రస్తుత సిరీస్‌లో భారత జట్టు ఆస్ట్రేలియాను 2-0 లేదా 3-1 తేడాతో ఓడించాలి. ఆస్ట్రేలియాపై భారత్ 2-0 ఆధిక్యంలో ఉంది. అయితే ఇప్పుడు టీమిండియా ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్‌లో ఫైనల్‌కు చేరుకోవాలంటే మిగిలిన రెండు మ్యాచ్‌ల్లోనూ అయితే విజయం సాధించాలి, లేదా డ్రా చేసుకోవాలి. ఇలాంటి పరిస్థితుల్లో ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌లో భారత జట్టు ఫైనల్ చేరడం దాదాపు ఖాయం.