IND Won: ఇండియా గ్రాండ్ విక్టరీ..12.5 ఓవర్లలోనే ఫినిష్

by srinivas |   ( Updated:2025-01-22 16:57:46.0  )
IND Won: ఇండియా గ్రాండ్ విక్టరీ..12.5 ఓవర్లలోనే ఫినిష్
X

దిశ, వెబ్ డెస్క్: కోల్‌కతా టీ 20 మ్యాచ్‌లో ఇండియా గ్రాండ్ విక్టరీ సాధించింది. టీ 20 సిరీస్‌లో శుభారంభం ప్రారంభమైంది. ఈడెన్ గార్డెన్స్‌లో ఇంగ్లండ్‌తో జరిగిన తొలి టీ20లో భారత్ ఆధిపత్యం కనబర్చింది. తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్ 20 ఓవర్లలో 132 పరుగులు చేసింది. ఇండియా బౌలర్ వరుణ్ చక్రవర్తి బాల్‌తో అద్భుతమైన ప్రదర్శన కనబర్చారు. దీంతో భారత్‌కు ఇంగ్లండ్ 133 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన భారత బ్యాటర్లు 12.5 ఓవర్లకే ఏడు వికెట్ల తేడాతో విజయ లక్ష్యాన్ని ఛేదించారు. మూడు వికెట్ల నష్టపోయి 133 పరుగులు చేశారు. దీంతో 5 మ్యాచ్‌ల టీ20లో 1-0 ఆధిక్యంలో భారత్ నిలిచింది.



Next Story

Most Viewed