- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
బ్రేకింగ్: పీకల్లోతు కష్టాల్లో భారత్.. 10 ఓవర్లకే ఐదు వికెట్లు
దిశ, వెబ్‌డెస్క్: మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా భారత్, ఆస్ట్రేలియాల మధ్య విశాఖలో జరుగుతోన్న రెండవ వన్డేలో టీమిండియా పీకల్లోతు కష్టాల్లో పడింది. ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి మొదట బ్యాటింగ్‌కు దిగిన భారత్‌కు ఆస్ట్రేలియా బౌలర్ స్టార్ బౌలర్ మిచెల్ స్టార్క్ చుక్కులు చూపిస్తున్నాడు. స్టార్క్ సంధించే బుల్లెట్ లాంటి బంతులను ఎదుర్కొనలేక టీమిండియా బ్యాటర్లు పెవిలియన్‌కు వరుసగా క్యూ కడుతున్నారు.
స్టార్క్ బౌలింగ్ ధాటికి టీమిండియా టాపార్డర్ కుప్పకూలింది. కెప్టెన్ రోహిత్ శర్మ 13, కేఎల్ రాహుల్ 9 పరుగులు చేసి ఔట్ కాగా.. యంగ్ బ్యాటర్ శుభమన్ గిల్, డేంజరస్ బ్యాటర్ సూర్య కుమార్ యాదవ్ డకౌట్ అయ్యారు. ఆల్ రౌండర్ హార్థిక్ పాండ్యా కేవలం 1 పరుగు మాత్రమే చేసి పెవిలియన్ చేరాడు. ప్రస్తుతం క్రీజ్‌లో స్టార్ బ్యాటర్ కోహ్లీ 22, జడేజా 2 ఉన్నారు. 4 వికెట్లతో మిచెల్ స్టార్ టీమిండియా టాపార్డర్ పతానాన్ని శాసించగా.. సీన్ అబాట్ ఓ వికెట్ తీశాడు. టీమిండియా ప్రస్తుతం 10 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 51 పరుగులు చేసింది.