రేపటి నుంచి అండర్-19 వరల్డ్ కప్ షురూ

by Harish |
రేపటి నుంచి అండర్-19 వరల్డ్ కప్ షురూ
X

దిశ, స్పోర్ట్స్ : మరో వరల్డ్ కప్‌కు వేళైంది. శుక్రవారం నుంచి సౌతాఫ్రికా వేదికగా అండర్-19 పురుషుల వరల్డ్ కప్ ప్రారంభకానుంది. ప్రారంభ రోజున రెండు మ్యాచ్‌లు జరగనున్నాయి. ఒక మ్యాచ్‌లో అమెరికా, ఐర్లాండ్ జట్లు తలపడగా.. మరో మ్యాచ్‌లో సౌతాఫ్రికా, వెస్టిండీస్ జట్లు ఎదురుపడనున్నాయి. ఇక, డిఫెండింగ్ చాంపియన్‌గా బరిలోకి దిగుతున్న భారత్ 6వ టైటిల్‌పై కన్నేసింది. ఈ టోర్నీ చరిత్రలో భారత్‌కు తిరుగులేని రికార్డు ఉంది. అత్యధికంగా ఐదుసార్లు టీమ్ ఇండియా విజేతగా నిలిచింది. శనివారం బంగ్లాదేశ్‌తో మ్యాచ్‌తో భారత్ టోర్నీని మొదలుపెట్టనుంది. అనంతరం ఈ నెల 25న ఐర్లాండ్‌తో, 28న అమెరికాతో చివరి గ్రూపు మ్యాచ్ ఆడనుంది. ఈ టోర్నీలో భారత్‌ను ఉదయ్ సహారన్ నడిపించనున్నాడు. హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ నుంచి అవనీష్ రావు, మురుగన్ అభిషేక్ ప్రపంచకప్‌ జట్టుకు ఎంపికైన విషయం తెలిసిందే. మొత్తం ఈ టోర్నీలో 16 జట్లు పాల్గొంటుండగా.. నాలుగు జట్ల చొప్పున నాలుగు గ్రూపులుగా విభజించారు. ప్రతి గ్రూపు నుంచి టాప్-3 జట్లు సూపర్-6 రౌండ్‌కు చేరుకుంటాయి. అక్కడి నుంచి రెండు జట్లు సెమీస్‌కు అర్హత సాధిస్తాయి. ఫిబ్రవరి 6, 8 తేదీల్లో సెమీస్ మ్యాచ్‌లు జరగనుండగా.. ఫిబ్రవరి 11న టైటిల్ పోరు జరగనుంది.

Advertisement

Next Story

Most Viewed