- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
IND Vs NZ: స్పిన్నర్ల మాయాజాలం.. కష్టాల్లో కొట్టుమిట్టాడుతోన్న న్యూజిలాండ్
దిశ, వెబ్‌డెస్క్: న్యూజిలాండ్‌తో టెస్ట్ సిరీస్‌లో భాగంగా ముంబై (Mumbai)లోని వాంఖడే స్టేడియం (Wankhade Stadium) వేదికగా ఇవాళ మూడో టెస్ట్ ప్రారంభమైంది. ఇప్పటికే సిరీస్‌లో టీమిండియా (Team India) 2-0 తేడాతో సిరీస్‌ను కోల్పోయింది. ఈ క్రమంలోనే టాస్ గెలిచిన న్యూజిలాండ్ కెప్టెన్ టామ్ లాథమ్ (Tom Latham) ముందుగా బ్యాటింగ్ ఎంచుకున్నాడు. అనంతరం బ్యాటింగ్ వచ్చిన ఓపెనర్లు కెప్టెన్ టామ్ లాథమ్ (Tom Latham), డెవాన్ కాన్వే (Devon Conwey)లు క్రీజ్‌లో కుదురుకునేందుకు తీవ్ర ఇబ్బందులు పడ్డారు.
చివరకు డెవాన్ కాన్వే (Devon Conway) 11 బంతుల్లో 4 పరుగులు చేసి పేసర్ ఆకాశ్ దీప్ (Akash Deep) బౌలింగ్‌లో ఎల్బీగా వెనుదిరిగాడు. అనంతరం కెప్టెన్ టామ్ లాథమ్ (Captain Tom Latham) 44 బంతుల్లో 28 పరుగులు చేసి వాషింగ్టన్ సుందర్ (Washington Sunder) బౌలింగ్‌లో క్లీన్ బౌల్డ్ అయ్యాడు. అనంతరం క్రీజ్‌లోకి వచ్చిన విల్ యంగ్ (Will Young) భారత బౌలర్లను ధీటుగా ఎదుర్కొంటూ వేగంగా పరుగులు రాబట్టేందు ప్రయత్నించాడు. కానీ, 138 బంతుల్లో 71 పరుగులు చేసి రవీంద్ర జడేజా (Ravindra Jadeja) బౌలింగ్ యంగ్ క్యాచ్ అవుట్‌గా పెవీలియన్ చేరాడు. బ్యాటింగ్ సంచలనం రచిన్ రవీంద్ర (Rachin Ravindra) ఈ మ్యాచ్‌లో పెద్దగా ఆకట్టుకోలేకపోయాడు. కేవలం 5 పరుగులు చేసి వాషింగ్టన్ సుందర్ (Washington Sunder) బౌలింగ్‌లో క్లీన్ బౌల్డ్ అయ్యాడు.
అదేవిధంగా కీపర్ టామ్ బ్లండెల్ (Tom Blundell) డకౌట్‌గా వెనుదిరిగాడు. 27 బంతుల్లో 17 పరుగులు చేసిన గ్లెన్ ఫిలిప్స్‌ను రవీంద్ర జడేజా క్లీన్ బౌల్డ్ చేశాడు. ప్రస్తుతం కివీస్ 6 కీలక వికెట్లను కోల్పోయి 192 పరుగులు చేసింది. డారెల్ మిచెల్ (Daryl Mitchell) 96 బంతుల్లో 53, ఇష్ సోధి (Ish Sodhi) 7 బంతుల్లో 1 పరుగు చేసి క్రీజ్‌లో ఉన్నారు. ఇక భారత బౌలర్లలో రవీంద్ర జడేజా (Ravindra Jadeja) 3 వికెట్లు, వాషింగ్టన్ సుందర్ (Washington Sunder) 2 వికెట్లు తీసుకున్నారు. పేసర్ ఆకాష్ దీప్ (Akash Deep)కు ఒక వికెట్ దక్కింది.