- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
IND Vs NZ: ఆచితూచి ఆడుతోన్న కివీస్ బ్యాట్స్‌మెన్లు.. టీ బ్రేక్ ముందు స్కోర్ ఎంతంటే?
దిశ, వెబ్‌డెస్క్: పూణే (Pune) వేదికగా టీమిండియా (Team India)తో జరగుతోన్న రెండు టెస్ట్‌లో న్యూజిలాండ్ (New zealand) జట్టు ఆచితూచి ఆడుతోంది. అంతకు ముందు టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న కివీస్ జట్టు (Kiwis Team) ఓపెనర్లు భారత పేసర్లను ఎదుర్కొనే క్రమంలో తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఆ జట్టు కెప్టెన్ టామ్ లాథమ్ (Captain Tom Latham) 22 బంతుల్లో 15 పరుగులు చేసి స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ (Spinner Ravichandran Ashwin) బౌలింగ్‌లో ఎల్బీగా వెనుదిరిగాడు. ఇక మరో ఓపెనర్ డెవాన్ కాన్వే (Devon Conway) ధాటిగా ఆడుతూ స్కోర్ బోర్టును పరుగులు పెట్టించేందుకు ప్రయత్నించాడు. ఈ క్రమంలోనే అతడు 141 బంతుల్లో 76 పరుగులు చేసి అశ్విన్ బౌలింగ్‌లో క్యాచ్ అవుట్ అయ్యాడు.
అనంతరం బ్యాటింగ్ దిగిన విల్ యంగ్ (Will Young) 45 బంతుల్లో 18 పరుగులు చేసి పెవీలియన్‌కు చేరాడు. ప్రస్తుతం న్యూజిలాండ్ జట్టు (New zealand Team) 3 వికెట్ల నష్టానికి 197 పరుగులు చేసింది. రచిన్ రవీంద్ర (Rachin Ravindra) 104 బంతుల్లో 65 పరుగులు, డారెల్ మిచెల్ (Dayrl Michell) 41 బంతుల్లో 15 పరుగులతో క్రీజ్‌లో ఉన్నారు. మరోవైపు టీమిండియా బౌలర్లలో స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ (Ravichandran Ashwin) ఒక్కడే 3 వికెట్లను నేలకూల్చాడు. ఇక పేసర్లు జస్ప్రీత్ బుమ్రా (Jasprit Bumrah), ఆకాశ్ దీప్ (Akash Deep)లు పెద్దగా ప్రభావం చూపలేకపోయారు. మరో ఇద్దరు స్పిన్నర్లు రవీంద్ర జడేజా (Ravindra Jadeja), వాషింగ్టన్ సుందర్ (Washington Sunder)లు ఒక్క వికెట్ కూడా తీయలేకపోయారు.